హుస్నాబాద్, ఆగస్టు 22: సీఎం రేవంత్‌రెడ్డి, మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రగల్బాలు పలకడం మానుకోవాలని హుస్నాబాద్ మాజీ ఎమ్మెల్యే వొడితెల సతీశ్‌కుమార్ అన్నారు. కేవలం మాటలతో మభ్యపెట్టి అధికారంలోకి రావడంతోపాటు అధికారంలోకి వచ్చాక మళ్లీ మాయమాటలతో రైతులు, ప్రజలను సీఎం రేవంత్‌రెడ్డి వంచిస్తున్నారని విమర్శించారు. రైతులకు రూ.రెండు లక్షల రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
గురువారం బీఆర్ఎస్ అధిష్టానం పిలుపు మేరకు హుస్నాబాద్‌లోని అంబేద్కర్ చౌరస్తాలో రైతులు, బీఆర్ఎస్ కార్యకర్తలతో కలిసి ధర్నా, రాస్తారోకో నిర్వహించారు. సుమారు రెండు గంటలపాటు రాస్తారోకో జరిగింది. సీఎం రేవంత్‌రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం డౌన్‌డౌన్ అంటూ నినాదాలు చేశారు. వెంటనే రైతులందరికీ రుణమా ఫీ చేయాలని, లేకుంటే రైతులతో కలిసి ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.
కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ ఆకుల రజితావెంకట్, వైస్‌చైర్‌పర్సన్ అయిలేని అనితారెడ్డి, మాజీ ఎంపీపీలు లకావత్ మానస, మాలోతు లక్ష్మి, కౌన్సిలర్లు, బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు గంగం మధుసూదన్‌రెడ్డి, పట్టణ అధ్యక్షుడు ఎండీ అన్వర్, నాయకులు ఎడబోయిన తిరుపతిరెడ్డి, ఆకుల వెంకట్, వెంకట్రాంరెడ్డి, అయిలేని మల్లికార్జున్‌రెడ్డి, వాల నవీ న్, వెంకట్రాంరెడ్డి, లక్ష్మణ్‌నాయక్, క్రాంతిరెడ్డి, స్వ రూప, విజయభాస్కర్, ప్రభాకర్‌రెడ్డి, పరశురామ్, బోజు రవీందర్, చిరంజీవి, రాజయ్య, శ్రీనివాస్, గీకురు వెంకటేశం, రైతులు పాల్గొన్నారు.