నారాయణఖేడ్, ఫిబ్రవరి 17 : కేసీఆర్ ప్రభుత్వ హయాంలో నారాయణఖేడ్ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశామని, గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం మంజూరు చేసిన పనులను పూర్తి చేయడంతోపాటు కొత్తవాటిపై దృష్టి పెట్టాలని మాజీ ఎమ్మెల్యే మహారెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. ఇటీవల ఎమ్మెల్యే సంజీవ్‌రెడ్డి అసెంబ్లీలో ప్రస్తావించిన అంశాలపై మాట్లాడారు. పెద్దశంకరంపేట మండలాన్ని సంగారెడ్డి జిల్లాలో కలపాలని ఎమ్మెల్యే అసెంబ్లీలో ప్రస్తావించడం హాస్యాస్పదమన్నారు.
గతం లో తాను చేసిన ప్రయత్నం మేరకు ప్రస్తుతం ఆ ఫైల్ (21912/da/2019) ముఖ్యమం త్రి కార్యాలయంలో ఉన్నదన్నారు. తడ్కల్ మండలం ఏర్పాటు అంశం బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే పూర్తి చేశామని, ఎన్నికల కారణంగా నిలిచిపోయిందన్నారు. తడ్క ల్ మండలం ఏర్పాటులో గతంలో రాజకీ యం చేశారని, ఈ రెండు అంశాలపై చిత్తశుద్ధి ఉంటే సాధించాలన్నారు. ఎమ్మెల్యే మరో విషయాన్ని అసెంబ్లీలో ప్రస్తావిస్తూ నల్లవాగు ప్రా జెక్టు కట్టుకాల్వ ప్రతిపాదనను ప్రభుత్వం దృష్టికి తేవడం నల్లవాగు ప్రాజెక్టు ఆయకట్టు ను ఎండబెట్టే రీతిలో ఉన్నదన్నారు.
1493 అడుగుల ఎఫ్టీఎల్ ఉన్న నల్లవాగు ప్రాజెక్టు నీటిని 1383 అడుగుల వద్ద నిజాంసాగర్‌కు మళ్లిస్తే కల్హేర్, సిర్గాపూర్, కంగ్టి మండల రైతులకు నష్టం జరిగే అవకాశం ఉన్నదన్నారు. అవసరమైతే ఎమ్మెల్యే దీనిపై క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని సూచించారు. రైతులకు నష్టం కలిగించే ఇలాంటి ప్రతిపాదనలను పక్కన పెట్టి బసవేశ్వర ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని ఎమ్మెల్యేకు సూచించారు. సమావేశంలో సిర్గాపూర్ ఎంపీపీ అధ్యక్షుడు మహిపాల్‌రెడ్డి, నారాయణఖేడ్ మున్సిపల్ వైస్‌చైర్మన్ పరశురామ్ పాల్గొన్నారు.