వర్గల్, మే 21: కార్యకర్తలకు బీఆర్ఎస్ అండగా ఉంటుందని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మండలంలోని చౌదర్పల్లిలో ఇటీవల రోడ్డుప్రమాదంలో మృతిచెందిన బీఆర్ఎస్ సీనియర్ నేత బుడిగె శంకర్‌గౌడ్ కటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించి ప్రమాదబీమాకింద మంజూరైన రూ.2 లక్షల చెక్కును అందజేశారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు పడిగె రాజు, మాజీ ఉపసర్పంచ్ పొద్దుటూరి శ్రీనివాస్‌గుప్తా, తుమ్మ గణేశ్ పాల్గొన్నారు.
గజ్వేల్, మే 21: ఆపదలో ఉన్న కార్యకర్తలను ఆదుకునే ఏకైక పార్టీ దేశంలోనే బీఆర్ఎస్ అని ఎఫ్డీసీ మాజీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. మంగళవారం మండలంని జాలిగామ గ్రామానికి చెందిన బీఆర్ఎస్ కార్యకర్త కుమ్మరి కనకయ్య కొద్ది రోజుల క్రితం కరెంట్‌షాక్‌తో మృతిచెందాడు. మృతుడికి బీఆర్ఎస్ సభ్యత్వం ఉన్నందున అతని కుటుంబీకులకు మంగళవారం రూ.2లక్షల ప్రమాదబీమా చెక్కును అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గజ్వేల్ నియోజకవర్గంలో 97,500 సభ్యత్వాలు కలిగి ఉన్నామని, పార్టీకి గజ్వేల్‌లో కార్యకర్తలు బలంగా ఉన్నారన్నారు. ప్రమాదాల్లో మృతి చెందిన 344 కుటుంబాలకు రూ. 6.80 కోట్ల విలువైన బీమా చెక్కులను అందజేశామన్నారు. మాజీ ఏఎంసీ చైర్మన్ శ్రీనివాస్, జడ్పీటీసీ మల్లే శం, శ్రీనివాస్‌రెడ్డి, రవీందర్రావు, రాజిరెడ్డి, స్వామి, ఆంజనేయులు, రమేశ్‌గౌడ్, ఎల్లం, అశోక్, రాము, శివ్వయ్య పాల్గొన్నారు.