చేర్యాల, సెప్టెంబర్15: కొమురవెల్లి శ్రీమల్లికార్జున స్వామి ఆలయంలో మహా అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. స్వామి వారి ఆలయంలో ప్రతిష్ఠించిన వినాయక మండపంలో ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నారు.
నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా ఆదివారం ఆలయ ఈవో బాలాజీ ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం భక్తులకు మహా అన్నదానం చేశారు. స్వామి వారి ఆలయంలో రెండు క్వింటాళ్ల బియ్యాన్ని అన్నంగా తయారు చేసి అనంతరం ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈవో, సూపరింటెండెంట్లు, ఆలయ ప్రధానార్చకుడు మహాదేవుని మల్లికార్జున్, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు.