టేక్మాల్/మెదక్ : తన కూతురు కాదనే అక్కసుతో చిన్నారిని హత్య చేసిన కేసులో నిందితుడ్ని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మెదక్ డీఎస్పీ సైదులు చెప్పారు. గురువారం మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. టేక్మాల్ మండలం పల్వంచ గ్రామానికి చెందిన వర్షిణి (3) హత్య కేసులో మారు తండ్రి రమణయ్యను అదుపులోకి తీసుకుని విచారించామన్నారు.
తన కూతురు కాదనే కసితో చిన్నారిని హత్య చేసినట్లుగా విచారణలో తేలినట్లు ఆయన తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి నిందితుడ్ని రిమాండ్కు తరలించినట్లు డీఎస్పీ వివరాలను వెల్లడించారు.