నారాయణరావుపేట, ఫిబ్రవరి 13: రైతులు కొత్త వంగడాలు వినియోగించి అధిక దిగుబడులు పొందాలని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ డైరెక్టర్ ఆర్కే మదర్ అన్నారు. మంగళవారం మండల పరిధిలోని లక్ష్మీదేవిపల్లిలో పొద్దు తిరుగుడు క్షేత్ర దినోత్సవాన్ని భారతీయ నూనె గింజల పరిశోధన సంస్థ, రైతు ఉత్పత్తిదారుల పరస్పర సహకార సంఘం ఆధ్వర్యంలో నిర్వహించారు.
ఈ సందర్భంగా సంస్థ డైరెక్టర్ మదర్ మాట్లాడుతూ రైతులు క్షేత్ర స్థాయిలో పంటల మార్పిడి చేయాలన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి శివప్రసాద్ మాట్లాడుతూ రైతులు పచ్చిరొట్ట ఎరువుల నుంచి భూమిని సారవంతంగా చేసుకొని ఎక్కువ దిగుబడులు పొందాలని, వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పంటలను పరిశీలించాలన్నారు. కార్యక్రమంలో శాస్త్రవేత్తలు సతీశ్‌కుమార్, శ్రీదేవి, మహేందర్, స్వామి, అనీల్ పాల్గొన్నారు.