శివ్వంపేట, జనవరి 24: కాంగ్రెస్ ప్రభుత్వం తమకెందుకు రుణమాఫీ చేయలేదని మెదక్ జిల్లా శివ్వంపేట మండలం దొంతిలోని యూ నియన్ బ్యాంకు ఎదుట శుక్రవారం రైతులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నిరసన తెలిపారు. గుండ్లపల్లికి చెందిన రైతులు ఉదయం యూనియన్ బ్యాంకుకు చేరుకొని తమకు రుణమాఫీ ఎందుకు కాలేదని బ్యాంకు మేనేజర్‌ను నిలదీశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ.. రైతులతో ప్రభుత్వం ఆడుకుంటున్నదని మండిపడ్డారు. అధికారులను సంప్రదిస్తే అక్కడ వెళ్లండి… ఇక్కడ వెళ్లండి అని తిప్పుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
పిం ఛన్ లబ్ధ్దిదారుల ఖాతాలు హోల్డ్‌లో పెట్టడం తో పింఛన్ తీసుకోలేక పోతున్నామని ఆగ్ర హం వ్యక్తం చేశారు. జనవరి 26 తర్వాత వేస్తామన్న రైతుభరోసా డబ్బులు తాము ఎలా తీసుకోవాలని ఆవేదన వ్యక్తం చేశారు. నర్సాపూర్ ఆత్మ కమిటీ మాజీ చైర్మన్ గొర్రె వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ..రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందన్నారు. సగం మంది రైతులకు రుణమాఫీ కాలేదన్నారు. పథకాల పేరిట ప్రజలను కాంగ్రెస్ మోసం చేస్తున్నదని దుయ్యబట్టారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్ శ్రీనివాస్‌యాదవ్, బోళ్ల సదానందం, ఉప్పునూతల వెంకటేశ్‌గౌడ్, ఉపునూతల సత్యాగౌడ్, బోళ్ల సత్తయ్య, వంచె సత్యనారాయణరెడ్డి, ఎలకంటి వినోద్, పెం జర్ల నర్సింహులు, మచుకురి రవి, బాలయ్య, బజారి శ్రీనివాస్‌రెడ్డి, బజారి మల్లారెడ్డి, ఇట్టబోయిన శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.
నాకు బ్యాంకులో రూ. లక్ష వరకు లోన్ ఉంది. పంట రుణమాఫీ ఐతదనుకున్న. కానీ, కాలేదు. అధికారులను అడిగితే రెండో లిస్టు, మూడో లిస్టు అన్నరు. నాకు రుణమాఫీ కాలేదు. అకౌంట్ కూడా లాక్ చేసి మూడు నెలల పింఛన్లు ఆపిర్రు. నా గతెట్ల కావాలే. అధికారులే న్యాయం చేయాలి.
– సూరారం సత్తయ్య, రైతు, గుండ్లపల్లి
నేను యూనియన్ బ్యాంకులో 60వేల లోన్ తీసుకున్న. ఫస్ట్ లిస్టులో రావాల్సిన నా పేరు నాలుగో లిస్టులో వచ్చింది. లిస్టులో పే రు వచ్చినా పైసల్ మాత్రం అకౌంట్లో పడలేవు. బ్యాంకు ఆఫీసర్లను అడిగితే గవర్నమెంట్ వేసే వరకు ఆగాలని చెప్తున్నారు. నాకు రుణమాఫీ అయినట్టా… ? కానట్టా…? అర్థం కావడం లేదు.
– ఎరుకలి బాలయ్య, రైతు, గుండ్లపల్లి