జహీరాబాద్, డిసెంబర్ 2 : పంట రుణమాఫీ కాకపోవడంపై సంగారెడ్డి జిల్లా న్యాల్కల్ మండలం అమీరాబాద్ గ్రామ రైతులు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. మండలంలోని చాల్కి ఏపీజీవీబీలో రూ. రెండు లక్షలలోపు పంటరుణం తీసుకున్నామని గ్రామానికి చెందిన రైతులు వైజ్యనాథ్, దత్తరెడ్డి, నర్సింహారెడ్డి, విజేంధర్రెడ్డి, సుధాకర్‌రావు, సురప్ప, చంధర్, నాగ్గోండ, సంగారెడ్డి తెలిపారు.
ప్రభుత్వ నిబంధన ప్రకారం రేషన్ కార్డు ప్రకారం కుటుంబ సభ్యులలో ఎవరికైనా ఒకరికి పంటరుణమాఫీ కావాల్సి ఉన్నా కాలేదన్నారు. నాలుగు విడతలుగా పంటరుణమాఫీ అయితదని ఎంతో ఆశతో ఎదురు చూసినా నిరాశే మిగిలిందన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం తగు చర్యలు తీసుకుని నిబంధన ప్రకారం అర్హులకు పంట రుణమాఫీ చేసి ఆదుకోవాలని వారు కోరారు.