రామాయంపేట, జూలై 27: రైతులకు ఎరువుల గోస తప్పడం లేదు. ఇప్పుడిప్పుడే వర్షాలు పడుతుండగా కర్షకులు యూరియా కోసం నరకయాతన పడుతున్నారు. సోమవారం మెదక్ జిల్లా రామాయంపేట పట్టణంలోని పీఏసీఎస్ కార్యాలయం వద్ద మండలానికి చెందిన వివిధ గ్రామాల రైతులు యూరియా కోసం బారులు తీరారు.
ఒక్కో రైతుకు ఒక బస్తా ఇవ్వడంతో రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. మూడు రోజుల ముందు యాప్ ద్వారా బుక్ చేసినా యూరియా లభించడం లేదని రైతులు వాపోయారు. యూరియా కోసం మండలంలోని రాయిలాపూర్, పర్వతాపూర్, దంతెపల్లి, కాట్రియాల, అక్కన్నపేట, ఝాన్సిలింగాపూర్ తదితర గ్రామాలకు చెందిన రైతులు పడిగాపులు కాశారు. ఉదయం యూరియా కోసం వచ్చిన రైతులకు మధ్యాహ్నం ఎరువుల బస్తాలు దొరికాయి.