న్యాల్కల్, సెప్టెంబర్ 13: నిమ్జ్ ప్రాజెక్టుకు స్వచ్ఛందంగా భూములు ఇచ్చేందుకు రైతులు ముందుకు వస్తే త్వరలోనే పరిహారా న్ని అందించేలా చర్యలు తీసుకుంటామని జహీరాబాద్ నిమ్జ్ ప్రాజెక్టు డిప్యూటీ కలెక్టర్ రవీందర్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని రేజింతల్ పంచాయతీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశం లో ఆయన పాల్గొన్నారు.
ఈ సందర్భంగా మా ట్లాడుతూ.. రేజింతల్‌లో 1700 ఎకరాల భూమిని నిమ్జ్ ప్రాజెక్టుకు సేకరించేందుకు ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. ఇప్పటి వరకు 400 ఎకరాలకు పైగా భూములను రైతులు స్వచ్ఛందంగా నిమ్జ్‌కు ఇచ్చారన్నారు. మిగిలిన రైతులు నిమ్జ్‌కు భూములు ఇవ్వాలని ఆసక్తి ఉంటే తమ అం గీకార పత్రాలను అందజేయాలని సూచించారు. ఎకరాకు రూ.15 లక్షల పరిహారాన్ని అందజేస్తామని తెలిపారు. నిమ్జ్ డిప్యూటీ తహసీల్దార్ జనార్దన్, రాచయ్యస్వామి, సిబ్బంది గోకుల్, పురుషోత్తం, నాయకులు శ్రీనివాస్‌రెడ్డి, మల్లారెడ్డి ల్గొన్నారు.