మెదక్, జనవరి 21(నమస్తేతెలంగాణ)/రామాయంపేట, జనవరి 21: అక్కన్నపేట స్టేషన్ నుంచి మెదక్ స్టేషన్ వరకు మంగళవారం దక్షిణమధ్య రైల్వే అధికారులు విద్యుత్ లైన్ రైలును విజయవంతంగా నడిపారు. మంగళవారం సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ నుంచి వచ్చిన దక్షిణ మధ్య రైల్వే అధికారులు అక్కన్నపేట రైల్వే స్టేషన్లో విద్యుత్ లైన్‌తో నడిపేందు కోసం రైలు ఇంజిన్‌కు పూజలు చేసి రైలును ప్రారంభించారు. అక్కన్నపేట, మెదక్ ప్రజల సౌకర్యార్థం విద్యుత్ లైన్ ద్వారా ఇక ప్రతిరోజు రైలును నడుపతామని రైల్వే అధికారులు తెలిపారు. అక్కన్నపేట స్టేషన్ నుంచి లక్ష్మాపూర్, పాతూర్ మీదుగా మెదక్ స్టేషన్ వరకు రైలు ఇంజిన్‌తో రైల్వే అధికారులు వెళ్లారు. ట్రయల్న్ సక్సెస్ కావడంతో అధికారులు సంతోషం వ్యక్తం చేశారు.
మెదక్-అక్కన్నపేట మధ్య రూ.15.49 కోట్లతో నిర్మించిన 17.2 కిలోమీటర్ల రైల్వే విద్యుద్ధీకరణ ట్రయల్న్ పనులు సక్సెస్ కావడంపై దక్షిణ మధ్య రైల్వే ప్రిన్సిపాల్ చీఫ్ ఎలక్ట్రికల్ ఇంజినీర్ బ్రిజ్ మోహన్ మీనా సంతోషం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అక్కన్నపేట లైన్ విద్యుద్దీకరణతో హైదరాబాద్ డివిజన్లో 94శాతం విద్యుద్దీకరణ పూర్తయినట్లు తెలిపారు. మనోహరాబాద్ నుంచి సిద్దిపేట వరకు కొత్తగా నిర్మించిన రైల్వే మార్గంలో కూడా విద్యుద్దీకరణ పనులు త్వరలో చేపడతామని ఆయన తెలిపారు. మేడ్చల్ నుంచి జిల్లా మీదుగా ముథ్కేడ్ వరకు 251 కిలోమీట్లర్లు డబ్లింగ్ పనులు మంజూరైనట్లు తెలిపారు. డబ్లింగ్ పనులు పూర్తయితే అదనపు రైళ్లు నడపడంతో పాటు రైళ్ల వెయిటింగ్ సమస్య తీరిపోతుందని ఆయన తెలిపారు. అక్కన్నపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు మూత్రశాలలు ఏర్పాటు చేస్తామని చెప్పారు.