చేగుంట, నవంబర్ 16: విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణిస్తే కెరీర్ ఉజ్వలంగా ఉంటుందని మెదక్ జిల్లా విద్యాధికారి రాధాకిషన్, జిల్లా వాలీబాల్ ఆసోసియేషన్ అధ్యక్షుడు అయిత పరంజ్యోతి అన్నారు. చేగుంటలోని ఆదర్శ పాఠశాల క్రీడా ప్రాంగణంలో ఎస్జీఎఫ్ బాలబాలికల రాష్ట్రస్థాయి స్కూల్‌గేమ్స్ ఫెడరేషన్ 68 క్రీడలను శనివారం జ్యోతి వెలిగించి వారు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ.. రాష్టంలోని పాత పది జిల్లాల నుంచి క్రీడాకారులు పాల్గొంటారని తెలిపారు. ఈనెల 16, 17, 18 తేదీల్లో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయిలో జరిగే క్రీడలకు ఎంపిక కావాలని కోరారు. కార్యక్రమంలో మాజీ ఎంపీపీ మాసుల శ్రీనివాస్, ఎంఈవో నీరజ, ఆదర్శ పాఠశాల ప్రిన్సిపాల్ చంద్రకళ, రాష్ట్ర యోగా కోచ్ కరణం గణేశ్‌కుమార్, పీఈటీల సంఘం జిల్లా అధ్యక్షుడు నాగరాజు, పీఈటీలు అల్లి నరేశ్, ఎ.శంకర్, విష్ణు, డి.శంకర్, శ్రీనివాస్, శారద తదితరులు పాల్గొన్నారు.