పాపన్నపేట, జూన్ 21: పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వన దుర్గామాత సన్నిధిలో పౌర్ణమిని పురస్కరించుకొని శుక్రవారం రాత్రి పల్లకీసేవ నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆలయంలో అమ్మవారి ఉత్సవ విగ్రహానికి ప్రత్యేకపూజాలు చేసి పల్లకీలో ఊరేగించారు. కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులతో పాటు ఆలయ చైర్మన్ బాలగౌడ్, ఈవో వినోద్‌రెడ్డి, పాలకవర్గ సభ్యు లు పాల్గొన్నారు.