గజ్వేల్, డిసెంబర్ 10: తెలంగాణ రాష్ట్రసాధన కోసం కేసీఆర్ 14ఏండ్లు పోరాటం చేసి రాష్ర్టా న్ని సాధించారని, కనీసం ఉద్యమంలో పాల్గొనని ఉద్యమ చరిత్ర, విలువలు తెలియని రేవంత్‌రెడ్డి ఆలోచనావిధానాలు చూస్తుంటే తెలంగాణ అస్తిత్వంపై దాడి చేసేలా ఉన్నాయని ఎమ్మెల్సీ డాక్టర్ యాదవరెడ్డి, మాజీ ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. తెలంగాణ తల్లి రూపాన్ని కాంగ్రెస్ తల్లిగా మార్చినందుకు నిరసనగా మంగళవారం గజ్వేల్‌లోని తెలంగాణ తల్లి విగ్రహానికి క్షీరాభిషేకం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ.. రేవంత్‌రెడ్డి ఆలోచనా విధానాలన్నీ ఉద్యమకాలానికి భిన్నంగా ఉన్నాయని, ఏనాడూ ఉద్యమంలో పాల్గొనని రేవంత్‌రెడ్డికి తెలంగాణ తల్లి రూపం విలువ తెలియదన్నారు.
ఆనాడు తెలంగాణ తల్లి రూపాన్ని విద్యావంతులు, మేధావులతో కలిసి చర్చించిన తర్వాత కేసీఆర్ అందరి సమక్షంలో ప్రకటించారన్నారు. తెలంగాణలో దసరా పండు గకు ప్రత్యేకత ఉందని, అలాంటి పండుగను గుర్తుచేసేలా తెలంగాణ తల్లి చేతిలో మొక్కజొన్న కంకులు, బతుకమ్మలతో కూడిన రూపం ఉందన్నారు. తెలంగాణ అస్తిత్వాన్ని దెబ్బతీసేలా సాగుతున్న రేవంత్‌రెడ్డి ప్రభుత్వానికి ప్రజలే తగిన బుద్ధి చెబుతారన్నారు. నేడు తెలంగాణ సమాజం రేవంత్‌రెడ్డి తీసుకుంటున్న విధానాలపై చర్చిస్తున్నారని, ఏ ఒక్క వర్గం కూడా తెలంగాణ తల్లి కొత్త రూపాన్ని స్వాగతించడం లేదన్నారు.
దమ్ముంటే ఎన్నికల సమయంలో ప్రజలకిచ్చిన హామీలపై దృష్టి సారించి అన్ని హామీలు నెరవేర్చాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, మాజీ ఏఎంసీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, పీఏసీఎస్ చైర్మన్ జెజాల వెంకటేశం గౌడ్, వైస్ చైర్మన్ జకీయొద్దీన్, మాజీ ఎంపీపీ అమరావతి, మండల పార్టీ అధ్యక్షులు బెండే మధు, నవాజ్‌మీరా, శ్రీనివాస్ గౌడ్, కుమార్, కౌన్సిలర్లు రజిత, గోపాల్‌రెడ్డి, శ్రీనివాస్, కనకయ్య, మల్లేశం, నాయకులు కృష్ణారెడ్డి, మద్దూరి శ్రీనివాస్‌రెడ్డి, దయాకర్‌రెడ్డి, బొల్లారం ఎల్లయ్య, జాఫర్ ఖాన్, విరాసత్ అలీ, దేవేందర్, రమేశ్ గౌడ్, స్వామిచారి, అహ్మద్, ఉమర్ పాల్గొన్నారు.