సైన్స్‌తోనే సమాజాభివృద్ధి
శాస్త్ర సాంకేతిక ఫలాలు ప్రతి పేదవాడికి అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు.
- శాస్త్ర సాంకేతిక ఫలాలు పేదవాళ్లకు అందాలి
- జిల్లాకు మొబైల్ సైన్స్ వ్యాన్ అందిస్తా
- ఎమ్మెల్సీ కూర రఘోత్తం రెడ్డి
- టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
- అదనపు కలెక్టర్ రాజర్షి షా
- సంగారెడ్డిలో ముగిసిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్
- విజేతలకు బహుమతుల ప్రదానం
సైన్స్‌తోనే అభివృద్ధి సాధ్యమవుతుందని, శాస్త్ర సాంకేతిక ఫలాలు పేదవాళ్ల దరికి చేరాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రాఘోత్తం రెడ్డి అన్నారు. సంగారెడ్డి జిల్లా కేంద్రంలో మూడు రోజుల పాటు నిర్వహించిన జిల్లా స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ శుక్రవారం ముగిసింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు బాగా కష్టపడి చదివి కుటుంబాలకు అండగా నిలబడాలన్నారు. తమకు ఇష్టమైన విషయాన్ని ఎంపిక చేసుకుని అందులో రాణించాలని పేర్కొన్నారు.
సైన్స్‌ను ప్రోత్సహించేందుకు తన నిధుల నుంచి మొబైల్ వ్యాన్ అందజేస్తానని ఈ సందర్భంగా హామీ ఇచ్చారు. జీవితంలో గెలుపోటములు సహజమని, ఎవరూ నిరుత్సాహానికి గురికాకుండా పట్టువదలని దీక్షతో విజయం సాధించేందుకు కృషి చేయాలని అదనపు కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌కు సంబంధించి 81 ప్రాజెక్టులు ప్రదర్శించగా, అందులో 8 ప్రాజెక్టులు, జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈకు సంబంధించి 14 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు.
– సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 9
సంగారెడ్డి కలెక్టరేట్, డిసెంబర్ 9 : శాస్త్ర సాంకేతిక ఫలాలు ప్రతి పేదవాడికి అందినప్పుడే నిజమైన అభివృద్ధి సాధ్యపడుతుందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ కూర రఘోత్తంరెడ్డి పేర్కొన్నారు. స్థానిక శాంతినగర్‌లోని సెయింట్ ఆంథోనీస్ పాఠశాలలో నిర్వహిస్తున్న జిల్లాస్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ శుక్రవారం ముగిశాయి. ఇన్స్పైర్ అవార్డ్స్ ఎగ్జిబిషన్‌కు సంబంధించి 81 ప్రాజెక్టులు ప్రదర్శించగా, అందులో నుంచి 8 ప్రాజెక్టులు, జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈకు సంబంధించి 14 ప్రాజెక్టులను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ముగింపు వేడుకలకు ఎమ్మెల్సీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా రఘోత్తంరెడ్డి మాట్లాడుతూ.. దేశం సైన్స్‌పరంగా అభివృద్ధి జరగాలని పేర్కొన్నారు. ఇప్పటికే అన్ని రంగాల్లో శాస్త్ర సాంకేతికతకు ఉన్న ప్రాముఖ్యతను వివరించారు. విద్యార్థులు బాగా కష్టపడి తమ కుటుంబాలకు బాసటగా నిలవాలన్నారు. చదువుపై కసి పెంచుకున్నప్పుడే ఉన్నత స్థానాలకు చేరుకుంటారని విద్యార్థులకు సూచించారు. విద్యార్థులు తమకు ఇష్టమైన విషయంలో శ్రద్ధచూపాలని, అన్ని సబ్జెక్టుల్లో రాణించాలన్నారు. అందుకు ఉపాధ్యాయుల సహకారం తీసుకోవాలని సూచించారు. జిల్లాలో సైన్స్ అభివృద్ధికి కృషి జరుగుతున్నదన్నారు.
సంగారెడ్డి జిల్లా కేంద్రంలో ఏర్పాటు చేసిన సైన్స్ మ్యూజియం చాలా బాగున్నదని కితాబిచ్చారు. సైన్స్ మ్యూజియంతో విద్యార్థుల్లో శాస్త్రీయ ఆలోచనలు వస్తాయని పేర్కొన్నారు. జిల్లాలో సైన్స్‌ను మరింత ప్రోత్సహించేందుకు ఎమ్మెల్సీ కోటాలోని నిధుల నుంచి మొబైల్ సైన్స్ వ్యాన్‌ను అందజేస్తానని ఎమ్మెల్సీ హామీ ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖ అధికారి నాంపల్లి రాజేశ్, నోడల్ అధికారి లింబాజీ, జిల్లా సైన్స్ అధికారి విజయ్‌కుమార్, ప్రిన్సిపాల్ కరుణాకర్‌రెడ్డి, ఉపాధ్యాయ సంఘాల నాయకులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.
టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి
సంగారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ రాజర్షి షా మాట్లాడుతూ విద్యార్థులు టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని సూ చించారు. జీవితంలో ఉన్న త స్థానాలకు చేరుకోవాలంటే గెలుపోటములు సహజమన్నారు. సైన్స్ పోటీల్లో విజ యం సాధించిన విద్యార్థులను అభినందిస్తూనే, ఎంపిక కాలేని విద్యార్థులు నిరుత్సాహానికి గురికావద్దని హితవు పలికారు. ఈసారి చేసిన లోటుపాట్లను సరిదిద్దుకొని వచ్చే పోటీల్లో రాణించేందుకు కృషి చేయాలన్నారు. శ్రద్ధ్ద గా చదువుకొని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని ఆకాంక్షించారు. అనంతరం జిల్లాస్థాయి పోటీల్లో గెలుపొందిన ఎగ్జిబిట్ విద్యార్థులకు ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డితో కలిసి అదనపు కలెక్టర్ రాజర్షిషా బహుమతులు అందజేశారు.

జిల్లా స్థాయి సైన్స్ ప్రదర్శనలో ఎంపికైన విజేతల వివరాలు
ఇన్స్పైర్ మనక్ అవార్డ్స్‌కు సంబంధించి మొత్తం 81 ప్రదర్శనలకు 8 ఎగ్జిబిట్లను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈకు సంబంధించి 14 ప్రాజెక్టులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఉపాద్యాయుల ప్రదర్శనలో భాగంగా జడ్పీహెచ్ఎస్ కోర్పోల్ కు చెందిన సిద్దారెడ్డి ‘గణితం సులువుగా నేర్చుకొనుట’ ప్రదర్శనతో రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు.

జేఎన్ఎన్ఎస్ఎమ్ఈఈకు సంబంధించిన ప్రాజెక్టు విజేతల వివరాలు

Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Indian Athletes | పేదరికాన్ని జయించి.. ఆసియా క్రీడల్లో పతకాల పంట! మన క్రీడాకారుల స్ఫూర్తిదాయక విజయగాథలు
Saudi Arabia | రియాద్ విమానాశ్రయం దాడిలో 12మంది మృతి.. మూడొందల మందికి గాయాలు..!
IND vs WI | బౌలర్లకు మరో సవాల్.. పొట్టి సిరీస్‌లో నేడు కీలక మ్యాచ్..!
Dharman | రజనీకాంత్ ‘ధర్మన్’పై భారీ అంచనాలు.. 2027 సంక్రాంతి నుంచి వేసవికి వాయిదా?
CJP Protest | 7వేల మంది అరెస్ట్.. నిరసనపై కేంద్రం నిర్బంధకాండ.. సీజేపీ ఆందోళనలపై ఉక్కుపాదం
ట్రెండింగ్ వార్తలు
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?
Kareena Kapur | నటి కరీనా బ్యాగ్ ఖరీదు రూ.13 లక్షలపైనే.. ఏంటి స్పెషల్..?

