చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటే లక్ష్యమని జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి అన్నారు. చేర్యాలలో చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండలాల బీఆర్ఎస్ కార్యకర్తలతో సోమవారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు ఇచ్చిన హామీలు కాంగ్రెస్ పార్టీ నెరవేర్చాలన్నారు. గులాబీజెండాను గుండెల్లో పెట్టుకున్న కార్యకర్తలకు రుణపడి ఉంటానన్నారు. నియోజకవర్గ అభివృద్ధితోపాటు ప్రజల సంక్షేమానికి పాటుపడుతానని హామీ ఇచ్చారు. కొమురవెల్లి మల్లన్నక్షేత్రాన్ని అన్నివిధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేస్తానన్నారు. రానున్న ఎన్నికలకు నాయకులు, కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని పిలుపునిచ్చారు.
చేర్యాల, డిసెంబర్ 11: గులాబీ జెండాను గుండెల్లో పెట్టుకొని జనగామపై బీఆర్ఎస్ జెండా ఎగురవేసిన ప్రతి కార్యకర్తకు రుణపడి ఉంటానని, నియోజకవర్గ అభివృద్ధితోపాటు ప్రజల సం క్షేమానికి అహర్నిషలు కృషి చేస్తానని ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డి హామీ ఇచ్చారు. సోమవారం చేర్యాలలో చేర్యాల, మద్దూరు, ధూళిమిట్ట, కొమురవెల్లి మండల కేంద్రంలో కొమురవెల్లి మండల కార్యకర్తలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ అధికార పార్టీ ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలని, ప్రజలకు ఎలాంటి నష్టం కలిగించిన ఊరుకునేది లేదన్నారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ త్వరలో కొలుకొని ప్రజా సేవలోకి వస్తార ని, అధికార పార్టీ కరెంటుపై చేస్తున్న ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో రూ.22 వేల కోట్ల అప్పులతో కరెంటు సంస్ధలను తెలంగాణకు అ ప్పగించారని, ప్ర జలు నిరంతరం నాణ్యమైన కరెం టు ఇచ్చేందుకు యాదాద్రి, భద్రాద్రి తదితర విద్యుత్ ప్లాం ట్లను నెలకొల్పినట్లు తెలిపారు. విద్యుత్ సబ్స్టేషన్లు, ట్రాన్స్పార్మర్లు ఏర్పాటు చేసి రైతులకు ఉచిత కరెంటు ఇవ్వడంతో పంటలు అధికంగా పండి రైతులు సంతోషంగా ఉన్నారన్నారు. రూ.85వేల కోట్లు అప్పు ఉన్నాయంటే, అప్పులు ఉంటేనే అందులోనే అభివృద్ధి, ప్రజల సంక్షేమం ఉంటుందని వివరించా రు. ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షల మేరకు చేర్యాల రెవెన్యూ డివిజన్ ఏర్పాటు చేయించే వరకు విశ్రమించనని, కొమురవెల్లి మల్లన్న క్షేత్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసుకునేందుకు కృషి చేస్తానన్నారు. జనగామ నియోజకవర్గంలో విజయోత్సం పేరిట బీఆర్ఎస్ ప్రజాప్రతినిధులు, నాయకులు ఇండ్ల ముందర డీజేలు పెట్టుకొని రెచ్చగొట్టే చర్యలు చేస్తున్నారని, అయినప్పటికీ కార్యకర్తలు ఎలాంటి ఆందోళనకు గురికావాల్సిన అవసరం లేదన్నారు.
ఎమ్మెల్యేగా తనను గెలిపించిన మీకు అన్నివిధాలుగా అండగా ఉంటానని, ఎలాంటి కష్టం వచ్చిన తనకు ఒక్క ఫోన్ కాల్ చేయాలని, పార్టీ శ్రేణులను ఆదుకుంటానన్నారు. జనగామ నియోజకవర్గ అభివృద్ధి కోసం తనకున్న సంబంధాలతో నిధులు తీసుకువస్తానని, మంత్రులు, అధికారుల వద్దకు వెళ్లి ఇక్కడి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. త్వరలో సర్పంచ్ ఎన్నికలు రానున్నాయని అందుకు కార్యకర్తలు, పార్టీ ముఖ్య నాయకులు సిద్ధంగా ఉండాలన్నారు. అధికారులు ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్త వహించాలని, ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. చేర్యాల మున్సిపాలిటీ, చేర్యాల రూరల్, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల్లో ఓటర్లు బీఆర్ఎస్కి మంచి మెజార్టీ ఇచ్చారని, వారిని మరువలేనన్నారు. కార్యక్రమాల్లో ఎంపీపీలు వుల్లంపల్లి కరుణాకర్, బద్దిపడిగె కృష్ణారెడ్డి, తలారీ కీర్తనాకిషన్, జడ్పీటీసీ సిలువేరు సిద్ధప్ప, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణిశ్రీధర్రెడ్డి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్‌రెడ్డి, మండల అధ్యక్షులు అనంతుల మల్లేశం, ముస్త్యాల నాగేశ్వర్రావు, మేక సంతోష్‌కుమార్, మంద యాదగిరి, గీస భిక్షపతి, వైస్ ఎంపీపీలు తాండ్ర నవీన్‌రెడ్డి, మలిపేద్ది సుమలతామల్లేశం, పీఏసీఎస్ చైర్మన్ నాగిల్ల తిరుపతిరెడ్డి, ఎంపీటీసీ ఫోరం రాష్ట్ర కార్యదర్శి గదరాజు యాదగిరి, సర్పంచ్‌లు, ఎంపీటీసీలు, ముఖ్య నాయకులు పాల్గొన్నారు.