న్యాల్కల్, ఫిబ్రవరి 22: సహజ సిద్ధంగా లభించే కొబ్బరి నీళ్లలో ఔషధ గుణాలు అధికంగా ఉంటాయి. ఎండాకాలంలో వేసవి తా పం నుంచి ఉపశమనం పొందడానికి, అలసట నుంచి తక్షణ శక్తిని పెంచుకోవడానికి ప్రజలు కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. మనిషి అనారోగ్యంతో ఉన్నప్పుడు గ్లూకోజ్ పెట్టిస్తారు.. కానీ, గ్లూకోజ్‌లో ఉండే పోషకాల కంటే కొబ్బరి నీటి లో అధికంగా పోషకాలు లభిస్తాయని వైద్యులు పేర్కొంటున్నారు. గర్భిణులు అనారోగ్యానికి గురైతే దవాఖానల్లో పదేపదే కొబ్బరి నీళ్లు తాగమని డాక్టర్లు చెబుతుంటారు. కొబ్బరి నీళ్లలో పోషక పదార్థాలతో పాటు మనిషి రోగనిరోధక శక్తి పెరుగుతుందని, రక్తాన్ని శుద్ధిచేసే గుణం కొబ్బరి నీళ్లకే సాధ్యమవుతుందని నిపుణులు పేర్కొంటున్నారు.
కడుపు మంటను తగ్గించడానికి, మనిషి శరీరంలో లవణాల శాతం పెంచడానికి ఈ నీళ్లు ఉపయోగపడతాయి. పానీయా ల కంటే వందరెట్లు ఆరోగ్యం పెంచే కొబ్బరి నీళ్లకు వేసవిలో డిమాండ్ అధికంగా ఉంటు ంది. స్థానికంగా దొరికే కొబ్బరి బొండాలతో పాటు పక్క రాష్ర్టాలైనా ఆంధ్ర, ఒడిశా నుంచి దిగుబతి చేసుకుంటారు. ఎండ తీవ్రత పెరిగిపోతుండడంతో వివిధ గ్రామాల్లోని చౌరస్తాల్లో కొబ్బరి బోండాలు విక్రయిస్తున్నారు. బొండం సైజును బట్టి రూ.20 నుంచి 40 వరకు విక్రయదారులు అమ్ముతున్నారు.