దోస్త్తోనే డిగ్రీ ప్రవేశాలు
ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే.
- మూడు విడతల్లో ప్రవేశాల ప్రక్రియ
- ఈ నెల 29తో ముగియనున్న తొలి విడత రిజిస్ర్టేషన్లు
- ఈ నెల 20 నుంచి 30 తేదీ వరకు వెబ్ ఆప్షన్లు
- జూన్ 6న సీట్ల కేటాయింపు
- జూన్ 7 నుంచి 12 వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్
- రూ.400తో జూన్ 6 నుంచి 13 వరకు రెండో దశ రిజిస్ట్రేషన్లు
- ఏయేటికాయేడు పెరుగుతున్న సీట్ల భర్తీ
- సంగారెడ్డి జిల్లాలో మొత్తం 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు
- గతేడాది ప్రభుత్వ కళాశాలల్లో 4200 సీట్లు
- విద్యార్థులు దోస్త్ వెబ్సైట్లో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి
సంగారెడ్డి కలెక్టరేట్, మే 17 : ఇంటర్మీడియట్ ఫలితాలు విడుదలైన నేపథ్యంలో రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాల కోసం దోస్త్ (డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ తెలంగాణ) నోటిఫికేషన్ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మేరకు దోస్త్ కన్వీనర్, చైర్మన్ లింబాద్రి కమిటీ ఆధ్వర్యంలో దోస్త్ నోటిఫికేషన్ విడుదల చేశారు. రాష్ట్రంలోని ఉస్మానియా, కాకతీయ, తెలంగాణ పాలమూరు, మహాత్మాగాంధీ, శాతవాహన, మహి ళా విశ్వ విద్యాలయం, జేఎన్టీయూ యూనివర్సిటీల పరిధిలోని డిగ్రీ కళాశాలకు దోస్త్ ద్వారా ప్రవేశాలను కల్పించనున్నారు.
జిల్లా లో మొత్తం 7 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా వాటిలో గతేడాది 4,200 సీట్లను ప్రభుత్వం కేటాయించింది. ఈ విద్యా సంవత్సరం మరిన్ని సీట్లను పెంచే అవకాశం ఉన్నది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తర్వాత ప్రభుత్వ పాఠశాలలతో పాటు ఉన్నత విద్యను అందించే కళాశాలల అభివృద్ధిపై ప్రభుత్వం చర్యలు తీసుకోడంతో ప్రభుత్వ విద్యకు బలోపేతం అవుతున్నది. రాష్ట్రంలోని 9 యూనివర్సిటీల పరిధిలో గల డిగ్రీ కళాశాలలో ప్రవేశాలకు సంబంధించి ప్రభుత్వం తెలంగాణ డిగ్రీ ఆన్లైన్ సర్వీసెస్ (దోస్త్) ద్వారా ప్రవేశాలను నిర్వహిస్తున్న విషయం తెలిసిందే.
రాష్ట్రంలో మొత్తం 142 ప్రభుత్వ డిగ్రీ కళాశాలలు ఉండగా, వాటితో పాటు అన్ని ప్రైవేటు డిగ్రీ కళాశాలల్లోనూ దోస్త్ ద్వారా ఆన్లైన్ ప్రవేశాలను చేపడుతున్నారు. దీంతో ఆయా కళాశాలకు ఉన్నత విద్యామండలి సీట్లను కేటాయిస్తుంది. దోస్త్ ద్వారా ప్రవేశాలు ప్రారంభించినప్పటి నుంచి ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో సీట్ల సంఖ్యను పెంచుతూ ప్రవేశాలు మెరుగుపడేలా చేసింది. గత ఐదేండ్లుగా దోస్త్ వచ్చినప్పటి నుంచి ప్రభుత్వ కళాశాలల సీట్ల సంఖ్య క్రమంగా పెరుగుతున్నది.
ప్రభుత్వ కళాశాల్లోనే అత్యున్నత ప్రమాణాలు
ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉన్నత ప్రమాణాలతో విద్యను అందిస్తున్నారు. ముఖ్యంగా యూజీసీ నిబంధనల మేరకు నిష్ణాతులైన అధ్యాపకుల ద్వారా విద్యా భోదన జరుగుతున్నది. అంతేకాకుండా జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి సెమినార్లు, వర్క్‌షాప్‌లు నిర్వహించడంతో పాటు విద్యార్థులకు ఆకర్షణీయమైన జిజ్ఞాస, యువతరంగం వంటి వినూత్న కార్యక్రమాలను అమలు చేస్తున్నారు. ప్రభుత్వ కళాశాలలో నిర్వహిస్తున్న విద్యార్థి ఆకర్షిత కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు.
మొత్తం మీద ఏయేటికాయేడు సీట్ల భర్తీ పెరుగుతున్నది. ఉదాహరణకు సంగారెడ్డి జిల్లా కేంద్రంలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఉమ్మడి రాష్ట్రంలో కేవలం 650 నుంచి 700 సీట్లు భర్తీ అయ్యేవి. దోస్త్ వచ్చిన తర్వాత ఆ సంఖ్య క్రమంగా పెంచుతూ వచ్చారు. తొలుత 2019-20 విద్యా సంవత్సరంలో 1020 సీట్లు, 2020-21లో 1320 సీట్లు, 2021-22లో 1500 సీట్లు, 2022-23 సంవత్సరంలో 1620 సీట్లు, 2023-24 విద్యా సంవత్సరానికి 1740కి సీట్ల సంఖ్య పెంచారు. ఈఏడాది మరిన్ని సీట్ల సంఖ్య పెరిగే అవకాశం ఉన్నది. కళాశాలలో పెరిగిన సీట్లకు అనుగుణంగా ప్రవేశాలు కూడా అంతే స్థాయిలో కొనసాగుతున్నాయి.
హెల్ప్ డెస్క్ ఏర్పాటు
జిల్లా ఐడీ కళాశాల, తారా ప్రభుత్వ డిగ్రీ, పీజీ అటానమస్ కళాశాలలో హెల్ప్ డెస్క్‌ను ఏర్పాటు చేశారు. ఇంటర్మీడియట్ పూర్తి చేసుకున్న విద్యార్థులు డిగ్రీలో ప్రవేశం పొందడానికి దోస్త్ వెబ్సైట్ ద్వారా తమ పేరును రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. జిల్లాలోని విద్యార్థులు తమ రిజిష్ర్టేషన్ల సమయంలో టెక్నికల్ సమస్యలు తలెత్తినప్పుడు జిల్లా కేంద్రమైన సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ డిగ్రీ కళాశాలలోని హెల్ప్ డెస్క్‌ను సంప్రదించవచ్చను.
దోస్త్ షెడ్యూలు ఇలా
ఈ నెల 6 నుంచి 29వ తేదీ వరకు తొలి దశ రిజిస్ర్టేషన్లు కొనసాగుతున్నాయి. ఈ నెల 20 నుంచి 30 వరకు వెబ్ ఆప్షన్లు, ఈ ప్రక్రియలో భాగంగా మే 28న ప్రత్యేక వర్గాల వారి ధ్రువపత్రాల పరిశీలన, 29న ఎన్సీసీ, ఇతర వర్గాల పత్రాల పరిశీలన, జూన్ 6న తొలి దశ సీట్ల కేటాయింపు, జూన్ 7 నుంచి జూన్ 12 వరకు విద్యార్థులు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. రెండో దశ రిజిస్ర్టేషన్లు రూ.400ల రుసుముతో జూన్ 6 నుంచి 13వ తేదీ వరకు ఉంటుంది. జూన్ 6 నుంచి 14 వరకు వెబ్ ఆప్షన్లు, 13న పీహెచ్సీ, ఎన్సీసీ వర్గాల పత్రా ల పరిశీలన, అదే నెల 18న సీట్ల కేటాయింపు చేపట్టనున్నారు.
జూన్ 19 నుంచి 24వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్‌తో రెండో దశ ప్రవేశాలు పూర్తికానున్నాయి. అదే రూ.400ల రుసుముతో జూన్ 19 నుంచి 25 వ తేదీ వరకు మూడో దశ రిజిస్ట్రేషన్లు ప్రారంభమవుతాయి. జూలై 19 నుంచి 26 వరకు వెబ్ ఆప్షన్ల నమోదు, 25న ప్రత్యేక వర్గాల పత్రాల పరిశీలన, అదే నెల 29న సీట్ల కేటాయింపు, 29 నుంచి జూలై 3వ తేదీ వరకు ఆన్లైన్ సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. అయితే ఈ మూడు దశలలో సెల్ఫ్ రిపోర్టింగ్ చేసిన విద్యార్థులు సంబంధిత కళాశాలల్లో జూన్ 29 నుంచి జూలై 5లోగా రిపోర్ట్ చేయాల్సి ఉంటుంది. జూలై 1 నుంచి 6వ తేదీ వరకు స్టూడెంట్ ఓరియంటేషన్ నిర్వహించనుండగా, జూలై 7 నుంచి డిగ్రీ మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభం కానున్నాయి.
ప్రభుత్వ కళాశాలలోనే మెరుగైన విద్య
పేద విద్యార్థులకు ఉన్నత విద్య అందుకోవాలనే కల నెరవేర్చేందుకు ప్రభుత్వ కళాశాలలు స్వాగతం పలుకుతున్నాయి. ప్రభుత్వ కళాశాలలో అన్ని మౌలిక వసతులను కల్పించినందున విద్యార్థులు తమ పరిధిలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రవేశం పొందాలి. కాలానుగుణంగా విద్యార్థులకు అవసరమైన కొత్త కోర్సులు అందుబాటులోకి వచ్చా యి. అందుకు సంబంధించిన అధ్యాపకులను కూడా ఏర్పా టు చేశారు. తమకు ఇష్టమైన, అనువైన కోర్సులను ఎంచుకొని ప్రభుత్వ విద్యను అందిపుచ్చుకోవాలి.
ప్రతి ఒక్కరూ ప్రభుత్వం అందిస్తున్న సౌకర్యాలను సద్వినియోగం చేసుకొని ఉన్నతంగా ఎదగాలి. తారా కళాశాలలో విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు ఉన్నాయి. వివిధ రకాల సర్టిఫికెట్ కోర్సులను కూడా అందిస్తున్నాం. ఆధునిక కంప్యూటర్ ల్యాబ్‌తో పాటు ఫిజికల్ సైన్సెస్, లైఫ్ సైన్సెస్ ల్యాబొరేటరీలు, లైబ్రరీ, మైదానం, జిమ్‌లతో పాటు వివిధ విషయాలకు సంబంధించిన ల్యాబొరేటరీలు అందుబాటులో ఉన్నా యి. ముఖ్యంగా విద్యార్థులను ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ విభాగాలు చురుకుగా పని చేస్తున్నాయి.
ఈ అవకాశాలను జిల్లాలోని విద్యార్థులందరూ వినియోగించుకోవాలి. దోస్త్ వెబ్సైట్ ద్వారా విద్యార్థులు తమ పేరును సకాలంలో రిజిస్ర్టేషన్ చేసుకోవాలి. తొలి విడుతలో పేరు రిజిస్ర్టేషన్ చేసుకునే వారు కేవలం రూ.200 రిజిస్ర్టేషన్ రుసుము చెల్లిస్తే సరిపోతుంది. ఆ తర్వా త దశ నుంచి రెండు, మూడు దశల్లో రూ.400ల రుసుము చెల్లించాల్సి ఉంటుంది.
– డాక్టర్ కేఎస్ఎస్ రత్నప్రసాద్, జిల్లా ఐడీ కళాశాల, తారా కళాశాల ప్రిన్సిపాల్
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
విద్యపై దృష్టి పెట్టి ఉన్నత లక్ష్యాలను సాధించాలి : జైలర్ సంజీవరెడ్డి
Women Carried Guns To Mumbai | టైగర్ ష్రాఫ్‌పై కాల్పుల కోసం.. ముంబైకు గన్స్ తరలించిన యూపీ మహిళలు
Mirage 2000D: కూలిన మిరేజ్-2000డీ యుద్ధ విమానం.. ఒకరు మృతి, మరొకరి కోసం గాలింపు
Akada Demonstrations | గోదావరిఖనిలో విశేషంగా ఆకట్టుకున్న అకాడ ప్రదర్శనలు.. కర్ర సామును ప్రదర్శించిన సంధ్యారాణి
NHM Employees | డీఎంహెచ్‌వో కార్యాలయం ఎదుట ఎన్హెచ్ఎం ఉద్యోగుల నిరసన
ట్రెండింగ్ వార్తలు
Instagram Reels | రీల్స్ మోజులో బిడ్డను మరిచిన తల్లిదండ్రులు.. అలల్లో కొట్టుకుపోతున్న చిన్నారిని కాపాడిన యువకుడు!
Kavathe Ekand Dussehra | దీపావళికి కాదు.. దసరా రాత్రంతా బాణసంచా కాల్చే గ్రామం!
Palapitta | దసరా వేళ కనిపించని పాలపిట్టలు.. తెలంగాణ రాష్ట్ర పక్షి కనుమరుగవుతోందా?
Bastar Dussehra | రావణ దహనం లేని దసరా.. 75 రోజులపాటు జరిగే బస్తర్ ఉత్సవం ప్రత్యేకత ఇదే!
Watch: ‘మద్యం సేవించి పాటలు పాడుతున్నారా?’.. సింగర్ దలేర్ మెహందీపై మంత్రి ఆగ్రహం

