Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
Kranthi Kiran | మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల్లో పంట నష్టపోయి రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కురుకోపోయారని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ఆందోళన వ్యక్తం చేశారు.
అల్లాదుర్గం : మెదక్ జిల్లాలోని అల్లాదుర్గం, టేక్మాల్, రేగోడ్ మండలాల్లో పంట నష్టపోయి రైతులు ఆర్థిక ఇబ్బందుల్లో కురుకోపోయారని, ఈ మండలాలను తక్షణమే కరువు మండలాలు ( Drought Mandals ) గా ప్రకటించి ఆర్థికంగా సాయం ( Relief ) చేయాలని ఆందోల్ మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్ ( Former MLA ) డిమాండ్ చేశారు.
శుక్రవారం మండలంలోని బహిరందిబ్బ, ముస్లాపూర్ గ్రామాల్లో వర్షభావం వల్ల నష్టపోయిన పంటలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రైతు బంధు కోసం నిర్వహించిన సర్వే ఆధారంగా కరువు మండలాలను ప్రకటించారని, క్షేత్ర స్థాయిలో సర్వే చేయకుండా కరువు మండలాలు ప్రకటించడం విడ్డురమ్మన్నారు.
అయితే కరువు మండలాల్లో ఎలాంటి సహాయ కార్యక్రమాలు చేస్తామనేది ప్రకటించలేదని ఆరోపించారు. 22 టీఎంసీలున్న సింగూరు ప్రాజెక్టు నీళ్లను మరమ్మతుల పేరిట వృధాగా వదిలేశారని విమర్శించారు. ముందస్తు చర్యల్లో భాగంగా నీటిని వృధాగా వదలకుండా చెరువులు, కుంటలను నింపాలన్న సోయి కాంగ్రెస్ ప్రభుత్వానికి లేదని మండిపడ్డారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kranthi Kiran | కరువు మండలాలుగా ప్రకటించి, రైతులను ఆదుకోవాలి : మాజీ ఎమ్మెల్యే క్రాంతికిరణ్
‘భట్టి విక్రమార్క రాజీనామా చేయాలి.. సీపీని వెంటనే బదిలీ చేయాలి’
Watch: మద్యం మత్తులో వాహనం నడిపిన మహిళా కానిస్టేబుల్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
PM Modi | దేశం కష్టాల్లో ఉంటే విపక్షాలకు సంతోషం.. ప్రధాని మోదీ తీవ్ర ఆరోపణలు..!
BRS Protest | భూత్పూర్ మండలాన్ని కరువు మండలంగా ప్రకటించాలని బీఆర్ఎస్ ధర్నా
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఇంజక్షన్ చూడగానే పక్షవాతం పరార్.. లేచి పరుగందుకున్న బెగ్గర్.. Video
El Nino | భారత్‌ను తీవ్రంగా దెబ్బకొట్టనున్న ఎల్‌నినో.. మార్చి నాటికి 55 వేల మరణాలు..!
Watch: పొలంలో నిద్రిస్తున్న కూలీలపై దాడికి చిరుత యత్నం.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: హోటల్ రూమ్ వద్ద కుప్పకూలి.. నూతన వధువు మృతి
Watch: లోయలోకి దూసుకెళ్లిన బస్సు.. ప్రయాణికులు ఏం చేశారంటే?

