పాపన్నపేట్, ఆగసు ్ట11: రాష్ట్రంలోని ప్రముఖ ఆలయాల్లో ఒకటైన ఏడుపాయల వనదుర్గమ్మను ఆదివారం భారీగా భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించారు. భక్తులు మంజీరా నదిలోని పాయల్లో పుణ్యస్నానాలు చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఒడిబియ్యం, కుంకుమార్చనలు ,తలానీలాలు,బోనాలు సమర్పించి మొక్కుకున్నారు.
ఆలయ ఈవో కృష్ణప్రసాద్, సిబ్బంది , రవివీర్కుమార్, సూర్యశ్రీనివాస్, మధుసూదన్‌రెడ్డి, ప్రతాప్‌రెడ్డి, తోట నర్సింలు,వరుణాచారి, రాజు, శ్రీకాంత సేవలందించారు. వేద పండితులు శంకరశర్మ, పార్థివశర్మ,మురళీధర్,రాజశేఖర్ పూజలు నిర్వహించారు. పాపన్నపేట్ ఎస్సై శ్రీనివాస్‌గౌడ్ సిబ్బందితో కలిసి బందోబస్తు విధులు చేపట్టారు.