బొల్లారం, ఫిబ్రవరి 5: నిధుల కేటాయింపులు, అభివృద్ధి పనుల్లో వివక్ష చూపుతున్నారంటూ బొల్లారం మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో సొంత పార్టీకి చెందిన కౌన్సిలర్లతోపాటు వైస్ చైర్మన్ సమావేశాన్ని బహిషరించారు. సోమవారం బొల్లారం మున్సిపల్ సర్వసభ్య సమావేశాన్ని చైర్పర్సన్ కోలన్ రో జాబాల్రెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. బీఆర్ఎస్ కౌన్సిలర్ చంద్రారెడ్డి అభివృద్ధి పనుల ఎజెండాను విసిరేసి నిరసన గళాన్ని వినిపించారు. నాలుగేండ్లుగా అభివృద్ధి పనులకు సం బంధించి నిధుల కేటాయింపులో చైర్పర్సన్, కమిషనర్లు వివక్ష చూపుతున్నారని ఆక్షేపించా రు. వారి తీరుకు నిరసనగా కౌన్సిలర్లు చంద్రారెడ్డి, నిహారిక, గోపాలమ్మ, జయమ్మ, సంధ్య, సంతోషి సమావేశాన్ని బహిషరించి కార్యాలయం ఎదుట బైఠాయించి కమిషనర్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
నాలుగేండ్లుగా వార్డుల్లో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని, అభివృద్ధి పనుల కోసం నిధులు ఇవ్వాలన్నారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో రూ. 6.40కోట్ల అభివృద్ధి పనులకు కౌన్సిల్ సభ్యులు తీర్మానం చేశారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రోజా బాల్‌రెడ్డి మాట్లాడుతూ.. అన్ని వార్డుల అభివృద్ధికి సమ ప్రాధాన్యం ఉంటుందని, కొంద రు సభ్యులు కావాలనే సభలో గందరగోళం సృష్టించారని ఆరోపించారు. కాగా కౌన్సిలర్ చంద్రారెడ్డి వర్గీయులు సమావేశాన్ని బహిషరించి నిరసన తెలపడం స్థానికంగా చర్చనీయాంశమైంది. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ సంగారెడ్డి, ఆర్వో శ్రీధర్, కౌన్సిలర్లు, కోఆప్షన్ సభ్యులు, ఆయా శాఖల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.