గుమ్మడిదల, నవంబర్ 20: సంగారెడ్డి జిల్లా గుమ్మడిదలలోని రైతు వేదిక వద్ద బుధవారం సహకార వారోత్సవాల ముగింపు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి రాష్ట్ర సహకార శాఖ ఎండీ అన్నపూర్ణ, జాయింట్ రిజిస్ట్ట్రార్లు ధాత్రిదేవి, వెంకటేశ్వర్లు, సంగారెడ్డి జూనియర్ అసిస్టెంట్ శ్రీధర్ ముఖ్యఅతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆదర్శ రైతులు సువర్ణ, జైపాల్‌రెడ్డి, ప్రశాంత్, రంగారెడ్డి, దేవేందర్, తిరుపతి, లక్ష్మారెడ్డి, ఎండీ యాదుల్, యాదిరెడ్డి, రాజేందర్‌రెడ్డి, బాల్‌రెడ్డి, కృష్ణారెడ్డి, కృష్ణవేణిని సన్మానించి బహుమతులు అందజేశారు.
ఈ సందర్భంగా అతిథులు మాట్లాడుతూ.. ఒకప్పుడు గుమ్మడిదల పీఏసీఎస్ సంఘం అద్దె భవనంలో కొనసాగిందని, ఇప్పుడు రెండంతస్తుల సొంత భవనం ఏర్పాటు చేసుకుని రైతులకు సహకారం అందిస్తునట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏవో శ్రీనివాస్‌రావు, ఏఈవో నిఖిత, డీసీసీబీ ఫీల్డ్ ఆఫీసర్ శ్రవణ్‌కుమార్, పీఏసీఎస్ సీఈవో లచ్చిరాంనాయక్, మాజీ జడ్పీటీసీ కుమార్‌గౌడ్, మాజీ సర్పంచ్ నర్సింహారెడ్డి, మద్దులబాల్రెడ్డి, ధర్మారెడ్డి, యాదయ్య పాల్గొన్నారు.