దుబ్బాక,జూలై 30 : రాష్ట్రంలో విద్యా వ్యవస్థను బలోపేతం చేసేందుకు ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని ఉపాధ్యాయ ఎమ్మె ల్సీ కూర రఘోత్తంరెడ్డి కోరారు. విద్యతోనే అభివృద్ధి సాధ్యమని, ఉచిత పథకాలతో పేదరిక నిర్మూలన సాధ్యం కాదని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. మంగళవారం దు బ్బాక నియోజకవర్గం అక్బర్పేట-భూంపల్లి మండలం పోతారెడ్డిపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ట్రిపుల్ ఐటీ సాధించిన విద్యార్థులకు అభినందన సభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్సీ హాజరయ్యారు.
పోతారెడ్డిపేట పాఠశాలలో పదో తరగతిలో వందశాతం ఉత్తీర్ణత సాధించడంతో పాటు 17 మంది విద్యార్థులకు బాసరా ట్రిపుల్ ఐటీలో సీటు రావడం, ఇందులో నాలుగురు విద్యార్థులకు 10 జీపీఏ రావడంపై ఎమ్మెల్సీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో దుబ్బా క, కొండపాక ఎంఈవోలు ప్రభుదాస్, శ్రీనివాస్‌రెడ్డి, పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటేశ్వర్‌రెడ్డి, ఉపాధ్యాయులు, సిబ్బంది పాల్గొన్నారు.