పటాన్చెరు, జూన్ 9: కాంగ్రెస్ ప్రభుత్వం రాజకీయ లబ్ధికోసమే కాళేశ్వరం ప్రాజెక్టుపై తప్పుడు ఆరోపణలు చేస్తున్నదని, బీఆర్ఎస్ను బద్నాం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నదని పటాన్చెరు నియోజకవర్గ బీఆర్ఎస్ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి ఆరోపించారు. బీఆర్ఎస్పై కుట్రతోనే కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం ప్రాజెక్టుపై విచారణ కమిషన్ ఏర్పాటు చేసిందని ఆయన ఆరోపించారు. సోమవారం హైదరాబాద్‌లోని కాళేశ్వరం ప్రాజెక్టు విచారణకు మాజీమంత్రి హరీశ్‌రావు హాజరు కాగా, ఆయనకు మద్దతుగా పటాన్చెరు బీఆర్ఎస్ నాయకులు వెళ్లారు.
బీఆర్ఎస్ హయాంలో మంత్రి మండలి ఆమోదంతో కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణం చేశారని ఆదర్శ్‌రెడ్డి వివరించారు. నీటిపారుదల శాఖ ఇంజినీరింగ్ అధికారుల పర్యవేక్షణలో ప్రాజెక్టు నిర్మాణం జరిగిందన్నారు. కాంగ్రెస్ ప్రాజెక్టుపై అనవసర రాద్ధాంతం చేస్తున్నదని ఆరోపించారు. కాంగ్రెస్ సర్కారు కక్షసాధింపులను ధైర్యంగా ఎదుర్కొంటామని, బీఆర్ఎస్ పార్టీ భవిష్యత్తులో ప్రజాస్వామ్య పద్ధతిలో పోరాటాలు చేస్తుందని ఆదర్శ్‌రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి, జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్‌రెడ్డి, రామచంద్రపురం మాజీ కార్పోరేటర్ తోంట అంజయ్య, నాయకులు జగన్నాథ్‌రెడ్డి, వెంకట్‌రెడ్డి పాల్గొన్నారు.
మద్దతు తెలిపిన నాయకులు…
పటాన్చెరు, జూన్ 9: కాళేశ్వరం విచారణ కమిషన్ ఎదుట హాజరైన మాజీ మంత్రి హరీశ్‌రావుకు మద్దతుగా పటాన్ చెరుకు చెందిన బీఆర్ఎస్ నేతలు భారీగా తరలి వెళ్లారు. సోమవారం హైదరాబాద్‌లో కాళేశ్వరం ప్రాజెక్టుపై జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్ విచారణ చేపట్టిన బీఆర్కే భవన్ ఎదుటకు వీరు వెళ్లారు. బీఆర్ఎస్ పటాన్ చెరు నియోజకవర్గ కోఆర్డినేటర్ ఆదర్శ్‌రెడ్డి, పటాన్చెరు కార్పొరేటర్ మెట్టు కుమార్ యాదవ్, తెల్లాపూర్ మాజీ సర్పంచ్ సోమిరెడ్డి , జిన్నారం మాజీ జడ్పీటీసీ కొలను బాల్ రెడ్డి,రామచంద్రపురం మాజీ కార్పొరేటర్ తొంట అంజయ్య, యూత్ నాయకులు పృథ్వీరాజ్, భారతి నగర్ డివిజన్ ప్రెసిడెంట్ బూన్, జగన్నాథ రెడ్డి,వెంకట్ రెడ్డి, నాయకులు వెళ్లారు.