కాంగ్రెస్‌కు గుణపాఠం చెప్పాలి
అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ప్రశ్నించారు. గురువారం జహీరాబాద్ మండలంలోని అల్గోల్, తుంకుంట, బూచినెల్లి గ్రామాల్లో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు.
- గాలి అనిల్‌కుమార్‌ను గెలిపించాలి
- ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు
కోహీర్, మే 2: అసెంబ్లీ ఎన్నికల్లో గెలిచిన వెంటనే డిసెంబర్ 9న అన్ని పథకాలను అమలు చేస్తామని చెప్పిన సీఎం రేవంత్‌రెడ్డి ఆ రోజు నుంచి ఇప్పటివరకు ఎందుకు చేయలేదని ఎమ్మెల్యే కొనింటి మాణిక్‌రావు ప్రశ్నించారు. గురువారం జహీరాబాద్ మండలంలోని అల్గోల్, తుంకుంట, బూచినెల్లి గ్రామాల్లో జహీరాబాద్ బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్‌కు మద్దతుగా ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాణిక్‌రావు మాట్లాడుతూ కాంగ్రెస్ 2014కంటే ముందు కూడా తెలంగాణ ప్రజలను మోసం చేసిందన్నారు. ప్రస్తుతం ఏ ఒక్క పథకాన్ని సరిగా అమలు చేయకుండా దేవుళ్లపై ఒట్టు వేస్తున్నారని మండిపడ్డారు. రైతులకు రూ.2లక్షల రుణమాఫీ, నిరుద్యోగ భృతి రూ.4వేలు, మహిళలకు నెలనెలా రూ.2,500, రైతుభరోసా రూ.15వేలు, కౌలు రైతులకు రూ.12వేలు, ఫింఛన్లు రూ.4వేలు ఎవరికైనా ఇచ్చారా అని నిలదీశారు. కల్యాణలక్ష్మి చెక్కులే ఇవ్వడం లేదని, ఇక తులం బంగారం ఎప్పుడు ఇస్తారన్నారు.
ఉద్యోగాల కోసం ఇంతవరకు ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదన్నారు. కానీ ఇప్పటికే 30వేల ఉద్యోగాలు ఇచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్‌పై ప్రజలు ఆగ్రహంతో ఉన్నారని, ఓటుతో తగిన గుణపాఠం చెబుతారన్నారు. ఒకరు మతం పేరు తో, మరొకరు రిజర్వేషన్ల పేరుతో రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఉద్యమకారుడు బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థి గాలి అనిల్‌కుమార్ ను గెలిపించాలన్నారు. తెలంగాణ ప్రజలు బా గు పడాలంటే బీఆర్ఎస్ అభ్యర్థులను గెలిపించాలని కోరారు. సమావేశంలో మండల అధ్యక్షుడు తట్టు నారాయణ, గుండప్ప పెంటారెడ్డి, షేక్ ఫరీద్, మచ్చేందర్, మోహన్‌రెడ్డి, గోవర్ధన్‌రెడ్డి, చంద్రకాంత్‌రెడ్డి, రాజు, బస్వరాజ్, అమిత్‌కుమార్ పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

