బాలికల విద్యతోనే సమాజాభివృద్ధి
ప్రతిఒక్కరూ పిల్లలను చదివిస్తేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు (ఎంపీ) ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం మండల పరిధి అల్లాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న బీరప్పస్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు.
- జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, ఎంపీ ఆర్ కృష్ణయ్య
రాయికోడ్, ఫిబ్రవరి 26: ప్రతిఒక్కరూ పిల్లలను చదివిస్తేనే కుటుంబం, సమాజం అభివృద్ధి చెందుతుందని జాతీయ బీసీ సంఘం అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు (ఎంపీ) ఆర్ కృష్ణయ్య అన్నారు. సోమవారం మండల పరిధి అల్లాపూర్ గ్రామంలో నిర్మిస్తున్న బీరప్పస్వామి దేవాలయం ప్రారంభోత్సవానికి ఆయన హాజరయ్యారు. గ్రామ కురుమ సంఘం అధ్యక్షుడు, న్యాయవాది పెద్దగొల్ల జగన్నాథ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆర్ కృష్ణయ్య మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని గొల్లకురుమలు విద్య, అర్థికంగా, రాజకీయంగా అభివృద్ధి చెందాలన్నారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఉన్నత చదువులు చదువుకునే పిల్లలకు తన వంతుగా సాయం చేస్తానన్నారు.
సమావేశంలో కురుమ సంఘం జిల్లా అధ్యక్షుడు నాగేశ్, రాష్ట్ర కురుమ సంఘం నాయకులు పైతర సాయికుమార్, తెలంగాణ గొర్రె,మేకల పెంపకందారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు బాపు మలిశెట్టి, వరం వైస్‌చైర్మన్ తుకారాం, మండల కురుమ సంఘం అధ్యక్షుడు ఆంజనేయులు, జిల్లా కురుమ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు కిష్టయ్య, ఎంపీటీసీ శంకరమ్మ, మాజీ సర్పంచ్‌లు నాగార్జున, ప్రవీణ్‌కుమార్, నర్సుమ్మ, మండల కురుమ యువజన సంఘం నాయకులు సింగితం రాజు, సంతోశ్, అగమయ్య, పాండు, గ్రామ కురుమ సంఘం నాయకులు పోతుల రాజు, అనిల్, తుకారం, తులాసీదాస్లు పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Hydraa | దసరా సెలవుల్లో కూల్చుడు వద్దు.. హైడ్రాకు ఉత్తర్వులు ఇవ్వండి.. హైకోర్టు ఆదేశాలు
TGSRTC | ఆర్టీసీ బకాయిల కోసం ఆస్తుల అమ్మకం.. మంత్రి ప్రకటనకు.. చప్పట్లు కొట్టిన కార్మిక నేతలు
Bathukamma | బతుకమ్మకూ నీళ్లులేవు.. కాంగ్రెస్ తెచ్చిన దుర్గతి… వరంగల్ జిల్లా ఆరెపల్లిలో కాలువకు బావినీరే గతి
IND vs WI | ఎవరిదో ఫైనల్ పంచ్.. నేడు భారత్-వెస్టిండీస్ చివరి టీ20!
Starlink vs Jio | పోటీకి జంకేది లేదు.. ఎవరికైనా చట్టాలు ఒక్కటే.. మస్క్‌కు గట్టిగా కౌంటర్ ఇచ్చిన రిలయన్స్
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

