మునిపల్లి,సెప్టెంబర్ 25: రైతుల భూ సమస్యలు త్వరగా పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులకు సూచించారు. బుధవారం మునిపల్లిలోని తహసీల్ కార్యాల యం, ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, ఆదర్శ పాఠశాలతోపాటు బుధేరా మహిళా డిగ్రీ కళాశాలను ఆకస్మికంగా సందర్శించారు.
తహసీల్ కార్యాలయం లో ఎల్ఆర్ఎస్, రికార్డు గదులు, రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం పీహెస్సీకి వచ్చిన రోగులతో మాట్లాడారు. మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులతో కలిసి భోజనం చేశారు. కార్యక్రమంలో తహసీల్దార్ ఆశాజ్యోతి, ఎంపీడీవో హరినందన్రావు, ఎంపీవో, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.