సంగారెడ్డి కలెక్టరేట్, జనవరి 6: ప్రజావాణి ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించాలని సంగారెడ్డి కలెక్టర్ వల్లూరు క్రాంతి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని గ్రీవెన్స్ హాల్లో నిర్వహించిన ప్రజావాణికి జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన అర్జీదారులు తమ ఫిర్యాదులను అధికారులకు అందజేసి సమస్యలు పరిష్కరించాలని కోరారు. ప్రజావాణిలో మొత్తం 85 అర్జీలు అందాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాధురీ, ఆర్డీవో రవీందర్రెడ్డిలతో కలిసి కలెక్టర్ అర్జీలు స్వీకరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ..ఆయా అర్జీలను సకాలంలో పరిష్కరించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు.
బైపాస్ రోడ్డులోని పాత వెలుగు కార్యాలయ ఆవరణలోని ఈవీఏం గోదాంను ఎన్నికల అధికారి, కలెక్టర్ వల్లూరు క్రాంతి సందర్శించారు. సాధారణ పరిశీలనలో భాగంగా సందర్శించారు. సీసీ టీవీ లో బ్యాలెట్ యూనిట్లు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ల సామగ్రిని భద్రపర్చిన తీరును కలెక్టర్ తనిఖీ చేశారు. నిరంతరం అప్రమత్తంగా ఉండా లని సిబ్బందికి సూచించారు.