మెదక్ రూరల్ (హవేలీ ఘన్పూర్) అక్టోబర్ 10 : మెదక్ జిల్లా హవేలీ ఘన్పూర్ మండలం కేంద్రంలోని
అడ్వాన్స్డ్ టెక్నాలజీ కేంద్రాన్ని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ ఐటిఐ ప్రిన్సిపల్ శ్రీనివాస్‌తో కలిసి పరిశీలించారు. ఈ సందర్బంగా కలెక్టర్ ఏటీసీ సెంటర్ మొత్తం కలియ తిరిగి సౌకర్యాలను, జరుగుతున్న వివిధ పనులపై వివరాలు అడిగి తెలుసుకున్నారు.
పెండింగ్‌లో ఉన్న పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. వివిధ కోర్సుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీలో ఉన్న అధునాతన మిషనరీ గురించి వివరాలను సంబంధిత అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఏటీసీ శిక్షణ విద్యార్థులకు ఉజ్వల భవిష్యత్తును అందిస్తుందని కలెక్టర్ అభిప్రాయపడ్డారు. కలెక్టర్ వెంట ఏటీసీ సెంటర్ నిర్వాహకులు, సిబ్బంది పాల్గొన్నారు.