పెద్దశంకరంపేట : బంగారు తెలంగాణ కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ ఎన్నికల్లో ఇచ్చిన హమీలతో పాటు సంక్షేమ పథకాలు చేపడుతూ అందరి మన్ననలు పొందుతున్నాడు. ప్రజా సంక్షేమమే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ద్యేయమని ఖేడ్ ఎమ్మెల్యే మహరెడ్డి భూపాల్‌రెడ్డి అన్నారు. మంగళవారం పెద్దశంకరంపేట పట్టణంలో ఎంపీపీ శ్రీనివాస్ నివాసంలో సీఎం రిలీప్ ఫండ్ చెక్కులను అందజేసిన అనంతనం ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు.
పేదప్రజలకు అండగా తెలంగాణ ప్రభుత్వం నిలుస్తుందని ప్రభుత్వపథకాలను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. పెద్దశంకరంపేట పట్టణానికి చెందిన జీనత్‌బేగం అనారోగ్యంతో బాధపడుతుండగా దవాఖాన ఖర్చుల నిమిత్తం సీఎం సహయనిధి కింద ఆమె భర్త రహీం డాక్టర్‌కు మంజూరైన 2 లక్షల 50 వేల చెక్కును అందజేశారు.
పట్టణానికి చెందిన రోషన్‌కు దవాఖాన ఖర్చుల నిమిత్తం రూ.29,500 చెక్కును అందజేశారు. కార్యక్రమంలో ఎంపీపీ జంగం శ్రీనివాస్, జడ్పీటీసీ విజయరామరాజు, రైతుబంధు మండల అధ్యక్షుడు సురేష్‌గౌడ్, సర్పంచ్ అలుగుల సత్యనారాయణ, నాయకులు వేణుగౌడ్, శంకర్‌గౌడ్, పున్నయ్య, జహంగీర్, తదితరులున్నారు.