సిద్దిపేట అర్బన్ /నంగునూరు, నవంబర్ 4: కోనాయిపల్లి ప్రజలు మురిసిపోయారు. తమ ప్రాంత ముద్దుబిడ్డ, రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామానికి రావడంతో ఆనందానికి లోనయ్యారు. నంగునూరు మండలం కోనాయిపల్లి గ్రామంలో శనివారం పండుగ వాతావరణం ఏర్పడింది. తనకు ఎంతో ఇష్టమైన, అచ్చొచ్చిన కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి మంత్రి తన్నీరు హరీశ్‌రావు, నాయకులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు.
సీఎం ఆలయంలో పూజలు చేయడానికి రావడంతో ఆ ప్రాంతమంతా జనసంద్రమైంది. గ్రామంతో పాటు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు, బీఆర్ఎస్ శ్రేణులు తరలివచ్చారు. గ్రామ మహిళలు మంగళహారతులు పట్టి.. నుదుటిన తిలకం దిద్ది.. పూలుచల్లి అభిమాన నేతకు ఘన స్వాగతం పలికి ఆత్మీయతను పంచారు. పూజల అనంతరం సీఎం కేసీఆర్ మహిళల వద్దకు వచ్చి అభివాదం చేయడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల వద్దకు వచ్చి అభివాదం చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడంతో ఆనందానికి లోనయ్యారు. పార్టీ శ్రేణులు పోటీపడి సీఎం కేసీఆర్‌తో కరచాలనం చేయగా.. వారందరికీ సీఎం షేక్‌హ్యాండ్ ఇచ్చారు. దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్ అంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు.
సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి గ్రామం శనివారం సందడిగా మారింది. గ్రామంలో పండుగ వాతావరణం కనిపించింది. తనకు ఎంతో ఇష్టమైన, అచ్చొచ్చిన కోనాయిపల్లి వేంకటేశ్వరస్వామి ఆలయంలో సీఎం కేసీఆర్ ప్రత్యేక పూజలు చేశారు. ఎర్రవల్లిలోని తన వ్యవసాయ క్షేత్రం నుంచి రోడ్డు మార్గాన మధ్యాహ్నం 12.36 గంటలకు గ్రామానికి చేరుకున్న ముఖ్యమంత్రికి ఆర్థిక, వైద్యారోగ్యశాఖల మంత్రి తన్నీరు హరీశ్‌రావు, జడ్పీ చైర్పర్సన్ రోజాశర్మ, బీఆర్ఎస్ నాయకులు, స్థానిక ప్రజాప్రతినిధులు, వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ఆలయంలో తొలుత ధ్వజ స్తంభానికి మొక్కి గుడిచుట్టూ ప్రదక్షిణలు చేశారు. అనంతరం నామినేషన్ పత్రాలను స్వామి వారి సన్నిధిలో ఉంచి సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు ప్రత్యేక పూజలు చేశారు. వేదపండితులు పూజలు నిర్వహించి నామినేషన్ పత్రాలతో పాటు తీర్థప్రసాదాలు అందజేశారు. సీఎం కేసీఆర్ గజ్వేల్, కామారెడ్డి శాసనసభకు వేసే (రెండు సెట్లు) నామినేషన్ పత్రాలపై సంతకాలు చేశారు. ఈనెల 9న గజ్వేల్, కామారెడ్డిలో సీఎం కేసీఆర్, సిద్దిపేటలో మంత్రి హరీశ్‌రావు తమ నామినేషన్లు వేయనున్నారు. ఈ పూజా కార్యక్రమం మధ్యాహ్నం 1.15 గంటల వరకు కొనసాగింది. పూజల అనంతరం సీఎం కేసీఆర్ బయటకు వచ్చి ప్రజలకు అభివాదం చేశారు. అంతకుముందే కోనాయిపల్లి గ్రామానికి మంత్రి హరీశ్‌రావు చేరుకొని ప్రజలకు, పార్టీ శ్రేణలకు అభివాదం చేశారు. అనంతరం హైదరాబాద్ తిరుగు పయనమయ్యారు.
సందడిగా మారిన కోనాయిపల్లి…
సీఎం కేసీఆర్ రాకతో కోనాయిపల్లి సందడిగా మారింది. తమ అభిమాన నాయకుడిని చూసేందుకు ఊరి జనమంతా ఆలయం వద్దకు తరలివచ్చారు. యువకులు, మహిళలు, రైతులు, పండుటాకులు, చిన్నారులు అంతా ఉత్సాహంగా వచ్చారు. చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజల వచ్చారు. మండల వ్యాప్తంగా బీఆర్ఎస్ కార్యకర్తలు తరలివచ్చారు. దీంతో గ్రామంలో ఎక్కడ చూసినా పండుగ వాతావరణం కనిపించింది. కార్యక్రమంలో ఎమ్మెల్సీ రఘోత్తంరెడ్డి, జడ్పీటీసీ తడిసిన ఉమా వెంకట్‌రెడ్డి, స్థానిక సర్పంచ్ వెంకటేశం, ఎంపీటీసీ రవీందర్‌రెడ్డి, ఆలయ కమిటీ చైర్మన్ విష్ణువర్ధన్‌రెడ్డి, నాయకులు బాలకిషన్‌రావు, శ్రీనివాస్‌రావు, కడవెర్గు రాజనర్సు, మచ్చ వేణుగోపాల్‌రెడ్డి, సాయిరాం, జాపశ్రీకాంత్రెడ్డి, దువ్వల మల్లయ్య, వేముల వెంకట్‌రెడ్డి, ఎడ్ల సోంరెడ్డి, నిమ్మ శ్రీనివాస్‌రెడ్డి, లింగంగౌడ్, కిష్టారెడ్డి, పురేందర్, ఆలయ కమిటీ సభ్యులు, ప్రజాప్రతినిధులు, వివిధ గ్రామాల బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.
తిలకం దిద్దిన మహిళలు
తమ గ్రామానికి వచ్చిన రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ను చూసి కోనాయిపల్లి మహిళలు మురిసిపోయారు. వేంకటేశ్వరస్వామి ఆలయానికి వచ్చిన కేసీఆర్‌కు గ్రామస్తులు, మహిళలు, పార్టీ శ్రేణులు ఘనస్వాగతం పలికారు. సీఎం కేసీఆర్‌కు తిలకం దిద్దారు. పూజల కార్యక్రమం అనంతరం సీఎం కేసీఆర్ మహిళల వద్దకు వచ్చి వారికి అభివాదం చేయడంతో వారంతా సంతోషం వ్యక్తం చేశారు. పార్టీ శ్రేణుల వద్దకు వచ్చి అభివాదం చేసి యోగ క్షేమాలు అడిగి తెలుసుకోవడంతో ఆనందానికి గురయ్యారు. పార్టీ శ్రేణులు పోటీపడి సీఎం కేసీఆర్‌తో కరచలనం చేయగా.. వారందరికీ సీఎం షేక్‌హ్యాండ్ ఇచ్చారు. దేశ్‌కీ నేత సీఎం కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ ఫ్లకార్డులు ప్రదర్శించారు. ఈ సందర్భంగా తెలంగాణ పాటల పందిరి సీడీని సీఎం కేసీఆర్ ఆవిష్కరించారు. పార్టీ శ్రేణులు, గ్రామస్తులు సీఎం కేసీఆర్‌పై గులాబీలతో పూల వర్షం కురిపించారు. సిద్దిపేట పోలీస్ కమిషనర్ శ్వేత ఆధ్వర్యంలో పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు.