జనం ప్రభంజనంలా మారింది. ఆదివారం దుబ్బాకలో సీఎం కేసీఆర్ ప్రజా ఆశీర్వాద సభ గ్రాండ్ సక్సెస్ అయ్యింది. ఒక్కొక్కరుగా కదిలొచ్చి వేలాదిగా పోటెత్తారు. జై కేసీఆర్ అంటూ నినాదాల హోరు కొనసాగింది.
కార్యకర్తలు, జనంతో గులాబీమయంగా మారింది. మహిళలతో పాటు యువకులు పెద్దఎత్తున తరలివచ్చారు. ఈ సందర్భంగా ప్రజలు హ్యాట్రిక్ సీఎం కేసీఆర్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.