వీఆర్ఏల ఎన్నో ఏండ్ల కలను సీఎం కేసీఆర్ నెరవేర్చారు. ఇన్నేండ్లు చాలీచాలని జీతంతో బతుకులు వెళ్లదీస్తున్న వీఆర్ఏల జీవితాల్లో వెలుగులు నింపారు. భవిష్యత్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ప్రభుత్వ ఉద్యోగులుగా క్రమబద్ధీకరణ చేశారు. వీఆర్ఏల కుటుంబాల్లో వెలుగులు నింపిన సీఎం కేసీఆర్ మా పాలిట దేవుడని మెదక్, సంగారెడ్డి జిల్లాలకు చెందిన వీఆర్ఏల సంఘం నాయకులు మురళి, పిట్ల రవీందర్ అన్నారు. మంగళవారం వారు ‘నమస్తే తెలంగాణ’ తో మాట్లాడి సంతోషం వ్యక్తం చేశారు. ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా జరగని న్యాయం సీఎం కేసీఆర్తో జరిగిందని పేర్కొన్నారు. ఆయనే మళ్లీ ముఖ్యమంత్రి కావాలన్నారు.
సంగారెడ్డి, జూలై 25 : తెలంగాణ ప్రభుత్వం అన్నివర్గాల ప్రజా సంక్షేమంతోపాటు వివిధ రంగాల్లో పని చేస్తున్న ఉద్యోగుల అభ్యున్న తికి చేస్తున్నది. ఎన్నో ఏండ్లుగా చాలీచాలని జీతానికి జీవితాంతం పని చేస్తున్న ఏఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తిస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించారు. రాష్ట్ర వ్యాప్తం గా గ్రామాల్లో విధులు నిర్వహిస్తున్న వీఆర్ఏలను క్రమబద్ధీకరిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ముఖ్యమంత్రి నిర్ణయంతో సంగారెడ్డి జిల్లాలో పనిచేస్తున్న 1240 మంది వీఆర్ఏలు ప్రభుత్వ ఉద్యోగులుగా మారనున్నారు. 61 ఏండ్లు నిండినవారి వారసులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయడంపై వీఆర్ఏలు హర్షం వ్యక్తంచేస్తున్నారు.
వీఆర్ఏల విద్యార్హతల ఆధారంగా ప్రభుత్వశాఖల్లో కేటాయించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. డిగ్రీ చదివిన వీఆర్ఏలకు జూనియర్ అసిస్టెంట్లుగా, ఇంటర్ పాసైన వారికి రికార్డు అసిస్టెంట్లుగా, పదో తరగతి పాసైన వారిని ప్రభుత్వ కార్యాలయాల్లో సబార్డినేట్ల్లుగా నియమించడానికి ప్రభు త్వం చర్యలు తీసుకుంటు న్నది. సీఎం ప్రకటన వెలువడగానే తహసీల్ కార్యాలయాల ఎదు ట సీఎం కేసీఆర్ చిత్రపటానికి వీఆర్ఏలు క్షీరాభిషేకాలు చేసి కృతజ్ఞతను చాటుకున్నారు. వీఆర్ఏల క్రమబద్ధ్దీకరణపై వీఆర్ఏల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు మురళితో ‘నమస్తే తెలంగాణ ప్రత్యేక ఇంటర్వ్యూ’
నమస్తే తెలంగాణ : సీఎం కేసీఆర్ ప్రకటనపై వీఆర్ఏల ప్రతిస్పందన ఎలా ఉంది?.
మురళి : 2012-14 సంవత్సరాల్లో నియమితులైన వీఆర్ఏలను క్రమబద్ధ్దీకరణ చేస్తూ సీఎం కేసీఆర్ ప్రకటించడంపై వీఆర్ఏలు హర్షం ప్రకటించారు. గత ప్రభుత్వ హయాంలో తమను క్రమబద్ధ్దీకరణ చే యాలని డిమాండ్ చేసినా పట్టించుకోలేదు. తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత వీఆర్ఏ జీవితాలు బాగుపడతాయనుకున్నాం. సీఎం కేసీఆర్ ప్రకటన వినగానే పట్టలేని సంతోషం కలిగింది.
నమస్తే తెలంగాణ : రెవెన్యూశాఖలో సుధీర్ఘకాలం పనిచేసిన సందర్భంగా వీఆర్ఏలను ఇతరశాఖలోకి మార్పు సబబేనా?
మురళి : రెవెన్యూశాఖలో పనిచేసిన అనుభవం వీఆర్ఏలకు కలిసి వస్తుంది. ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి, స్థానం కల్పించి, వేతనాలు పెంచితే పని చేసే తత్వమున్న ఉద్యోగి ఎక్కడైనా రాణిస్తాడు.
నమస్తే తెలంగాణ : వీఆర్ఏలకు వేతనాలు తెలంగాణ ప్రభుత్వమే పెంచింది కదా.. మీ అనుభూతి ఎలా ఉంది?
మురళి : వీఆర్ఏలుగా 2012-14లో అప్పటి ప్రభుత్వం ఏపీపీఏస్పీతో నియమాకాలు చేపట్టి రూ.6వేల వేతనం ఇచ్చింది. అప్పుడే వీఆర్ఏలకు వేతనాలు పెంచాలని, క్రమబద్ధ్దీకరణ చేయాలని డిమాం డ్ చేశాం. కానీ, కాంగ్రెస్ ప్రభుత్వం మమ్మల్ని పట్టించుకోకుండా గ్రా మాలకే పరిమితం చేసి ఊడిగం చేయించుకుంది. తెలంగాణ రాష్ట్రం సిద్ధించగానే సీఎం కేసీఆర్ వీఆర్ఏల వేతనాలను రూ.10వేల పెంచి, అదుకుకున్నారు. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించారు.
నమస్తే తెలంగాణ : మీరు చేపట్టిన ఆందోళనలతోనే ప్రభుత్వం ఉద్యోగ భద్రత, పేస్కేలను అమలు చేసిందని భావిస్తున్నారా?
మురళి : వీఆర్ఏలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించి పేస్కేలు అమలు చేయాలని డిమాండ్ చేశాం. కానీ, సీఎం కేసీఆర్ వీఆర్ఏలను క్రమబద్ధ్దీకరణ చేస్తూ ఉత్తర్వులు జారీ చేయడంతో వీఆర్ఏ ఉద్యోగుల్లో ఉప్పెనలా సంతోషం ఎగిసిపడినది. 61 ఏండ్లు నిండిన ఉద్యోగుల వా రసులకు ఉద్యోగావకాశాలు కల్పిస్తూ ప్రకటించడం మరో విశేషం.
నమస్తే తెలంగాణ : విద్యార్హతలతో కేటాయింపులు ఉంటాయా?
మురళి : ప్రభుత్వ నియామకాలు చేసేటప్పుడు అభ్యర్థుల విద్యార్హతలను పరిగణలోకి తీసుకుని కేటాయింపులు చేస్తారు. ఇతరశాఖల్లోకి సర్దుబాటు చేసినప్పుడు తప్పనిసరిగా విద్యార్హతల ఆధారంగా కేటాయింపులు జరుగుతాయి. డిగ్రీ చేసినవారికి జూనియర్ అసిస్టెంట్లుగా, ఇంటర్ చేసినవారికి రికార్డు అసిస్టెంట్లుగా, పది పాసైనవారికి ఆఫీస్ సబార్డినేట్ల్లుగా నియమిస్తామని ప్రభుత్వమే ప్రకటించింది. ప్ర భుత్వ నిర్ణయంతో వీఆర్ఏ కుటుంబ సభ్యుల్లో పట్టలేనంత సంతోషం. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలనే మేము కోరుకుంటున్నాము.