వెల్దుర్తి, సెప్టెంబర్ 20 : అన్నివర్గాల అభ్యున్నతికి ప్రభుత్వం కృషి చేస్తున్నదని నర్సాపూర్ ఎమ్మె ల్యే మదన్‌రెడ్డి అన్నారు. మంగళవారం మాసాయిపేట మండలంలోని రామంతాపూర్, బొమ్మారం, వెల్దర్తి మండలంలోని ఉప్పులింగాపూర్, ధర్మారం, మన్నెవారి జలాల్పూర్ గ్రామాల్లో లబ్ధిదారులకు ఆసరా పింఛన్ పత్రాలను అందజేశారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో ఏర్పాటు చేసిన సమావేశాల్లో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ర్టాన్ని అన్ని రం గాల్లో దేశంలోనే ఉన్నత స్థానంలో నిలుపాలన్నదే సీఎం కేసీఆర్ ధ్యేయమన్నారు. మేధావులు, అధికారులు, ప్రముఖులతో చర్చించి పథకాలను రూ పొందించి అమలు చేస్తున్న గొప్ప నాయకుడు కేసీఆర్ అని కొనియాడారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అభివృద్ధి, సంక్షేమ పథకాలను తెలంగాణలో సీఎం కేసీఆర్ అమలు చేస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారన్నారు. రైతుబంధు, రైతుబీమా, కల్యాణలక్ష్మి, షాదీముబారక్ తదితర పథకాలు చరిత్రలో నిలిచిపోతాయన్నారు.
దసరా పం డుగ అనంతరం డబుల్ బెడ్రూం ఇండ్లు మం జూరు చేస్తామని, అర్హులందరికీ ఇండ్లు ఇస్తామన్నారు. మాసాయిపేటలో మండల కార్యాలయాల నిర్మాణాల కోసం ప్రత్యేక నిధులు మంజూరు చేయిస్తానని చెప్పారు. వెల్దుర్తి-మెదక్ ప్రధాన రహదారిని సైతం రెండు లేన్ల రోడ్డు త్వరలో మంజూరు అవుతుందన్నారు. మంత్రి హరీశ్‌రావు చేతులమీదుగా ఉప్పులింగాపూర్ సబ్‌స్టేషన్, డబుల్ బెడ్రూం ఇం డ్లను ప్రారంభిస్తామన్నారు. రెండో విడత దళితబంధు యూనిట్లు పంపిణీ చేయనున్నట్లు ఎమ్మెల్యే తెలిపారు. కార్యక్రమంలో ఎంపీపీ స్వరూపానరేందర్రెడ్డి, జడ్పీటీసీ రమేశ్‌గౌడ్, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు భూపాల్‌రెడ్డి, సర్పంచ్‌లు మధుసూదన్‌రెడ్డి, భాగ్యమ్మ, ఎంపీటీసీలు సోని, నవనీత, మోహన్‌రెడ్డి, నాయకులు నరేందర్‌రెడ్డి, బాలేశ్, సిద్ధి రాంలుగౌడ్, మైసయ్య, సునందరెడ్డి, యాదవరెడ్డి, మోహన్‌రెడ్డి, మహేందర్‌రెడ్డి, శివకుమార్, శ్రీనివాస్‌గౌడ్, మల్లేశంగౌడ్, నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.