సీఎం కేసీఆర్ రోడ్ల అభివృద్ధికి పెద్దపీట వేస్తుండడంతో మారుమూల పల్లెలకు సైతం విశాలమైన రోడ్లు అందుబాటులోకి వచ్చాయి. పెరిగిన వాహనాల రద్దీతో పాటు వర్షాలకు పలుచోట్ల రోడ్లు దెబ్బతిన్నాయి.తాత్కాలికంగా ప్యాచ్ పనులు చేసినప్పటికీ మళ్లీ గుంతలు పడి అధ్వానంగా మారాయి. ఈ సమస్యకు రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టనున్నది. మెదక్, నారాయణఖేడ్ నియోజకవర్గాల్లో గతుకుల రోడ్లు, అస్తవ్యస్త రహదారుల నుంచి వాహనదారులకు మోక్షం కల్పించనున్నది. ప్రధానంగా మండల కేంద్రాల నుంచి తండాలకు మరింత మెరుగైన రవాణా సౌకర్యం కల్పించాలనే లక్ష్యంతో సర్కార్ చర్యలు తీసుకున్నది.గిరిజన ప్రాంతాల్లో రోడ్ల మరమ్మతులు, పంచాయతీ, ఆర్అండ్బీ రోడ్ల బీటీ రెన్యువల్స్ కోసం మెదక్‌కు రూ.88 కోట్లు, నారాయణఖేడ్‌కు రూ.46.21 కోట్లు మంజూరు చేసింది. కేటాయించిన నిధులతో శాశ్వత పరిష్కారం లభిస్తుందని గిరిజన వాసులు పేర్కొంటున్నారు.
మెదక్, డిసెంబర్ 10 (నమస్తే తెలంగాణ): రోడ్లు ఇక జిగేల్మననున్నాయి. వాహనదారుల కష్టాలు తీరనున్నాయి. ఏళ్లుగా అనుభవిస్తున్న నరకయాతనకు చెక్ పడనున్నది. మెదక్ నియోజకవర్గంలో గిరిజన ప్రాంతాల రోడ్లు, పంచాయతీరాజ్ రోడ్లు, ఆర్అండ్బీ రోడ్లకు మహర్దశ పట్టనున్నది. రాష్ట్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేయడంతో త్వరలో సమస్యలు తీరనున్నాయి. పనులు పూర్తయితే మెదక్ నియోజకవర్గం ప్రజలకు మేలు చేకూరనున్నది.
మెదక్ నియోజకవర్గానికి రూ.88 కోట్లు..
మెదక్ నియోజకవర్గంలోని గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.44 కోట్లు మంజూరయ్యాయి. పంచాయతీరాజ్ రోడ్లకు రూ.20 కోట్లు, అందులో రూ.10 కోట్లు మరమ్మతులు, మరో రూ.10 కోట్లు బీటీ రెన్యువల్స్‌కు మంజూరయ్యాయి. ఆర్అండ్బీ రోడ్లకు రూ.24 కోట్లు మంజూరయ్యాయి. మెదక్ మండలం జడ్పీ రోడ్డు నుంచి తిమ్మక్కపల్లి తండా వరకు రూ.70 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు బాలానగర్ వయా బాలానగర్ తండా వరకు రూ.56 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి వెంకటాపూర్ తండా వరకు రూ.1.35 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి మల్కాపూర్ తండా వరకు రూ.1.80 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి సంగాయిగూడ తండా, అప్రోచ్‌రోడ్ నుంచి మంగలిగుట్ట తండా వరకు రూ.65 లక్షలు మంజూరయ్యాయి.
రామాయంపేట మండలంలో దామరచెర్వు నుంచి దామరచెర్వు తండా వరకు రూ.1.95 కోట్లు, ఝాన్సీలింగాపూర్ నుంచి సదాశివనగర్ తండా వరకు రూ.3.55 కోట్లు, పర్వతాపూర్ నుంచి బిల్యా తండా వయా కిషన్‌తండా, 3 నంబర్ తండా వరకు రూ.2.55 కోట్లు, జడ్పీ రోడ్డు నుంచి లక్యా తండా వయా 3 నంబర్ తండా, భిక్షపతి తండా, రాంచందర్ వరకు రూ.3.10 కోట్లు, రామాయంపేట దౌల్తాబాద్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పెద్ద తండా వరకు రూ.1.02 కోట్లు, దౌల్తాబాద్ పీడబ్ల్యూడి రోడ్డు నుంచి వెంకటాపూర్ వయా రామాయంపేట తండా వరకు రూ.1.55 కోట్లు మంజూరయ్యాయి.
హవేళీఘనపూర్ మండలంలో స్కూల్ తండా నుంచి సూర్య తండా వరకు రూ.కోటి 35 లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి శుక్లాల్పేట తండా వరకు రూ.75 లక్షలు, జడ్పీ రోడ్ నుంచి కొత్తచెర్వు తండా జడ్పీ రోడ్డు వయా భారతమాత తండా వరకు రూ.90 లక్షలు, బూర్గుపల్లి జడ్పీ రోడ్డు నుంచి గాజిరెడ్డిపల్లి బంజారా తండా మీదుగా బూర్గుపల్లి రైస్ మిల్ వయా తండా వరకు రూ.2.35 కోట్లు మంజూరయ్యాయి. పాపన్నపేట మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి యూసుఫ్‌పేట టూ అన్నారం తండా మీదుగా అన్నారం జడ్పీ రోడ్డు వరకు రూ.3.55 కోట్లు, పోమియా తండా నుంచి సీతియాతండా వరకు రూ.45 లక్షలు మంజూరయ్యాయి.
నిజాంపేట మండలంలో తిప్పన్నగుల్ల నుంచి కాసింపూర్ వయా కాశింపూర్ తండా వరకు రూ.కోటి 60 లక్షలు, బచ్చురాజ్‌పల్లి ధర్మారం రోడ్డు నుంచి తిప్పన్నగుల్ల వయా షౌకత్పల్లి తండా, వడ్డెర కాలనీ వరకు రూ.3 కోట్ల 35 లక్షలు మంజూరయ్యాయి. చిన్నశంకరంపేట మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి కొర్విపల్లి ఎల్టీ తండా వరకు రూ.కోటి 35 లక్షలు, సీసీ రోడ్డు జంగరాయి ఎల్టీ తండా జడ్పీ నుంచి ఏదుల్లపల్లి రోడ్ నుంచి జంగరాయి తండా వరకు రూ.65 లక్షలు, సురారం పీడబ్ల్యుడీ రోడ్డు నుంచి సురారం ఎల్టీ వరకు రూ.2 కోట్ల 25 లక్షలు, సూరా రం ఎల్టీ నుంచి చందంపేట వరకు రూ.కోటి 75 లక్షలు, నార్సింగి పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి నర్సింహ ఎల్టీ మిర్జాపల్లి వరకు రూ.2కోట్ల 25 లక్షలు, ఎస్.కొండాపూర్ జడ్పీ రోడ్డు నుంచి గవ్వలపల్లి ఎల్టీ (బంతికుంట తండా) వరకు రూ.85 లక్షలు మంజూరయ్యాయి.
ఆర్అండ్బీ రోడ్లకు రూ.24 కోట్లు..
మెదక్ నియోజకవర్గంలోని ఆర్అండ్బీ రోడ్లకు రూ.24 కోట్లు మంజూరయ్యాయి. ఇందులో మెదక్-సిద్దిపేట రహదారిపై చల్మెడ, నందగోకుల్, నస్కల్, రాంపూర్, నిజాంపేట రోడ్డు వరకు రూ.3 కోట్ల 40 లక్షలు, పీఆర్ నుంచి పిల్లికోటాల్ నుంచి చంది వయా వెల్దుర్తి రోడ్డు వరకు రూ.3 కోట్ల 55 లక్షలు, పీఆర్ నుంచి పాపన్నపేట-లింగాయిపల్లి రోడ్డు వరకు రూ.కోటి 75 లక్షలు, ఆర్అండ్బీ రోడ్డు నుంచి మెదక్-సిద్దిపేట వయా చల్మెడ, నందగోకుల్, నస్కల్, రాంపూర్, నిజాంపేట రోడ్ వరకు రూ.12 కోట్ల 40 లక్షలు, మెదక్-సిద్దిపేట రోడ్డు పోలీస్‌స్టేషన్ నుంచి ఎస్సీ కాలనీ రామాయంపేట టౌన్ లిమిట్స్‌లో రూ.5 కోట్ల 85 లక్షలు మంజూరయ్యాయి.
పంచాయతీరాజ్ రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్స్‌కు..
హవేళీఘనపూర్ మండలం జక్కన్నపేట నుంచి పీడబ్ల్యూడీ రోడ్డుకు రూ.కోటి 99 లక్షలు, హవేళీఘనపూర్ నుంచి చౌట్లపల్లి వరకు రూ.కోటి 44 లక్షలు, నిజాంపేట మండలం నస్కల్ నుంచి రాంపూర్ వరకు రూ.2 కోట్ల 17 లక్షలు, బ్యాలెన్స్ వర్క్ నస్కల్ నుంచి రాంపూర్ వరకు రూ.63 లక్షలు, పాపన్నపేట మండలంలో పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి పాపన్నపేట వరకు రూ.కోటి 20 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి ఏడుపాయల దేవస్థానం వరకు రూ.2 కోట్ల 17 లక్షలు, చిన్నశంకరంపేట మండలంలో బ్యాలెన్స్ వర్క్ పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి జంగరాయి వరకు రూ.33 లక్షలు మంజూరయ్యాయి.
హవేళీఘనపూర్ మండలంలో జడ్పీ రోడ్డు నుంచి కప్రాయిపల్లి వరకు రూ.90 లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి దూప్‌సింగ్ తండా వరకు రూ.3 కోట్లు, లింగ్సాన్‌పల్లి నుంచి లింగ్సాన్‌పల్లి తండా వరకు రూ.67 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి శమ్నాపూర్ ఎల్టీ వయా కొత్తచెర్వు ఎల్టీ వరకు రూ.కోటి 60 లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి బ్యాతోల్ బీసీ కాలనీకి రూ.67 లక్షలు, హవేళీఘనపూర్ నుంచి చౌట్లపల్లి వరకు రూ.8 లక్షలు, పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి గంగాపూర్ రూ.9 లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి రమ్లాగూడెం తండా లింగ్సాన్‌పల్లి తండా వరకు రూ.40 లక్షలు, జడ్పీ రోడ్డు నుంచి లింగ్సాన్‌పల్లి తండా వరకు రూ.5 లక్షలు, పీడబ్ల్యూడీ రోడుడ నుంచి శమ్నాపూర్ వరకు రూ.13.90 లక్షలు, మెదక్ మండలంలో జడ్పీ రోడ్డు నుంచి మల్కాపూర్ తండా వరకు రూ.45 లక్షలు, చిట్యాల జడ్పీ రోడ్డు నుంచి పెద్దబాయి తండా వరకు రూ.40 లక్షలు, రామాయంపేట మండలం సుభాష్ తండా వరకు రూ.57 లక్షలు, చిన్నశంకరంపేట మండలం సూరారం పీడబ్ల్యూడీ రోడ్డు నుంచి చందంపేట వరకు రూ.కోటి 55 లక్షలు మంజూరయ్యాయి.
ఇకపై ఇక్కట్లకు చెల్లు…
కొన్నాళ్లుగా ఈ రోడ్లపై వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. మెదక్ నియోజకవర్గంలో పంచాయతీరాజ్ ఆధీనంలో రోడ్ల మరమ్మతులకు, బీటీ రెన్యువల్స్‌కు మార్గం సుగమం కావడంతో ఇకపై వాహనదారులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ప్రయాణం సాఫీగా సాగుతుంది.
సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు కృతజ్ఞతలు
మెదక్ నియోజకవర్గానికి రూ.88 కోట్లు మంజూరయ్యాయి. గిరిజన ప్రాంతాల రోడ్లకు రూ.44 కోట్లు, పీఆర్ ద్వారా రూ.20 కోట్లు, ఆర్అండ్బీ ద్వారా రూ.24 కోట్లు రోడ్ల మరమ్మతులు, బీటీ రెన్యువల్స్‌కు నిధులు మంజూరు చేసిన సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావుకు ప్రత్యేక కృతజ్ఞతలు. నియోజకవర్గ అభివృద్ధికి సీఎం కేసీఆర్ ఎంతో కృషి చేస్తున్నారు. నియోజకవర్గంలో రోడ్లకు పెద్దపీట వేస్తున్నారు. ఇక రోడ్లకు మహర్దశ పట్టనున్నది. గతంలో ఏ ప్రభుత్వాలు ఇంత పెద్ద మొత్తంలో రోడ్లకు నిధులు మంజూరు చేయలేదు.
– ఎం.పద్మాదేవేందర్‌రెడ్డి, మెదక్ ఎమ్మెల్యే