నర్సాపూర్, ఫిబ్రవరి 12 : ప్రతి ఎకరానికి సాగు నీరు అందించే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ అపర భగీరథుడిగా మారి కాళేశ్వరం ప్రాజెక్టును నిర్మించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పను లు శరవేగంగా జరుగుతున్నాయి. నర్సాపూర్ నియోజకవర్గ పరిధిలో కాళేశ్వరం పనులు ముమ్మరంగా కొనసాగుతున్నా యి. నర్సాపూర్ మండలపరిధిలోని చిప్పల్తుర్తి గ్రామశివారులో నుంచి వెల్దుర్తి మండలం మంగళ్పర్తి గ్రామ శివారు వరకు 18వ ప్యాకేజ్లో భాగంగా కాళేశ్వరం కాలువ నిర్మా ణం కొనసాగుతున్నది. మల్లన్న సాగర్ నుంచి సాగునీరు కాళేశ్వరం కాలువ గుండా సంగారెడ్డి జిల్లా సింగూర్ డ్యామ్ లో కలువనున్నాయి. కాలువను సుమారు 44 కిలోమీటర్ల వరకు నిర్మించనున్నారు. ఇప్పటికే నర్సాపూర్ మండల పరిధిలోని తుజాల్పూర్, మంతూర్, రెడ్డిపల్లి గ్రామాల వద్ద కాలువ నిర్మాణం చివరి దశకు చేరుకుంది. ప్రస్తుతం వెల్దుర్తి మండలం మంగల్పర్తిలో పనులు జరుగుతున్నాయి.
కాళేశ్వరం కాలువ నిర్మాణం ఒక ఎత్తు అయితే.. అందు లో భాగంగా నిర్మించే సొరంగం ఒక ఎత్తు. నర్సాపూర్ మం డలంలోని చిప్పల్తుర్తి గ్రామ శివారు నుంచి రెడ్డిపల్లి గ్రామ శివారు వరకు సొరంగాన్ని నిర్మిస్తున్నారు. రెడ్డిపల్లి నుంచి చిప్పల్తుర్తి వరకు ఎతైన ప్రదేశం ఉండడంతో సొరంగం ద్వారా నీటిని సరఫరా చేయడానికి సొరంగాన్ని నిర్మిస్తున్నా రు. ప్రస్తుతం సొరంగ నిర్మాణ పనులు రెడ్డిపల్లి గ్రామంలో కొనసాగుతున్నాయి. సొరంగాన్ని 4.25 కిలోమీటర్ల విస్తీర్ణం లో నిర్మిస్తున్నారు. సొరంగాన్ని 30 మీటర్ల వైశాల్యంలో తవ్వుతున్నారు. ఇప్పటివరకు 2.5 కిలోమీటర్ల వరకు సొరం గం నిర్మాణాన్ని పూర్తి చేశారు. సొరంగం నిర్మాణంతో భవిష్యత్లో ఎలాంటి ఆటంకాలు జరుగకుండా ఆధునిక సాంకే తిక పరిజ్ఞానంతో నిర్మాణం చేపడుతున్నారు. సొరంగంలో ఒక మీటర్ దూరానికి రెండు రిబ్స్ ఏర్పాటు చేసి, స్టీల్ షీట్స్ వెల్డింగ్ చేసి మధ్యమధ్యలో కాంక్రీట్ ఫిల్ చేసి నిర్మిస్తున్నా రు. 4.25 కిలోమీటర్ల దూరం సొరంగాన్ని నిర్మించి, కాళే శ్వరం నీటిని సరఫరా చేయనున్నారు. సొరంగం నిర్మాణం అద్భుతమని ప్రతి ఒక్కరూ ఆశ్చర్యానికి గురవుతున్నారు. కాళేశ్వరం కాలువ నిర్మాణం పూర్తయితే 15 వేల ఎకరాలకు సాగునీరు అందుతుందని అధికారులు పేర్కొన్నారు.