బీఆర్ఎస్ హయాంలో సిద్దిపేట పట్టణం పరిశుభ్రతతో అలరారింది. ప్రస్తుతం పట్టణం కంపుకొడుతున్నది. అధికార యంత్రాంగం నిర్లక్ష్యంతో డ్రైనేజీలు చెత్తాచెదారంతో నిండి దుర్గంధం వెదజల్లుతున్నాయి. పట్టణంలో ఎక్కడికక్కడ చెత్త పేరుకుపోతున్నది.
డ్రైనేజీలు పిచ్చిమొక్కలతో నిండిదోమలు, ఈగలతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పారిశుధ్యం పడకేయడంతో ప్రజలు రోగాల బారినపడి, దవాఖానల చుట్టూ తిరుగుతున్నారు.
– సిద్దిపేట స్టాఫ్ ఫొటోగ్రాఫర్, ఆగస్టు 28