సిద్దిపేట, జూన్ 24: ప్రతినెలా సివిల్ రైట్స్ డే నిర్వహించాలని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్య అధికారులకు సూచించారు. ఎస్సీ, ఎస్టీల సమస్యలు పరిషరించడంతో పాటు చట్టా లు, సంక్షేమ పథకాల గురించి అధికారులు సంపూ ర్ణ అవగాహన కల్పించాలన్నారు. మంగళవారం సిద్దిపేటలోని ఐడీవోసీలోని సమావేశ మందిరంలో ఎస్సీ, ఎస్టీ ల్యాండ్ ,అట్రాసిటీ కేసులపై సిద్దిపేట కలెక్టర్ కె. హైమావతి, సీపీ అనురాధ, ఎస్సీ, ఎస్టీ కమిషన్ సభ్యులు కొంకటి లక్ష్మీనారాయణ, రాంబా బునాయక్, లీలాదేవి, జిల్లా శంకర్, రెణికుంట్ల ప్రవీణ్, ఎస్సీ, ఎస్టీ సంఘాల సభ్యులతో కలిసి ఆయన సమీక్షించారు.
ఈ సందర్భంగా జిల్లాలో నమోదైన కేసులకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకోవడంతో పాటు అవసరమైన కేసుల వివరాల నివేదిక అందించాలని పోలీస్ అధికారుల ను కోరారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూలై నెలాఖరులోగా పెండింగ్లో ఉన్న ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన కేసులు పరిషరించా లన్నారు. ప్రతినెలా చివరి వారంలో సివిల్ రైట్స్ డే,ప్రతి మూడు నెలలకు ఒకసారి డీవీఎంసీ సమావేశం నిర్వహించాలన్నారు. జిల్లాలో డీవీఎంసీ కొత్త సభ్యుల ఎన్నిక గురించి జిల్లా ఇన్చార్జి మంత్రి గడ్డం వివేక్ దృష్టికి తీసుకువెళ్లి అతి త్వరలో సభ్యుల ఎన్నికకు సంబంధించి కలెక్టర్ ద్వారా ఆదేశాలు జారీ చేయిస్తామన్నారు.
జిల్లాలో బెస్ట్అవైలబుల్ సూళ్లకు సంబంధించి నిధుల అమలులో జాప్యం లేకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్తానన్నారు. జిల్లాలో టెన్త్లో 91.92 శాతం ఉత్తీర్ణత సాధించినం దుకు డీఈవోశ్రీనివాస్రెడ్డి, టీచర్లను ఆయన అభినందించారు. సిద్దిపేటలో బంజారా భవన్ కోసం ఈనెలాఖరు లోగా అనువైన స్థలాన్ని గుర్తిం చి నిర్మాణానికి చర్యలు తీసుకోవాలన్నారు. ఇంది రమ్మ ఇండ్లు మంజూరైన ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారుల వివరాలు కమిషన్కు అందజేయాలని ఆదేశించారు. సమీక్షలో గ్రంథాలయ సంస్థ చైర్మన్ లింగమూర్తి, అదనపు కలెక్టర్లు గరిమాఅగర్వాల్, అబ్దుల్ హమీ ద్, ఆర్డీవోలు, డీఎస్పీలు, ఆయాశాఖల అధికారులు ఎస్సీ, ఎస్టీ సంఘాల ప్రతినిధులు పాల్గొన్నారు.