నర్సాపూర్, డిసెంబర్ 17 : ప్రభుత్వ అనుమతులు తీసు కుని ఇటుక బట్టీలను చట్టబద్దంగా నిర్వహించాలని యజమానులకు జూనియర్ సివిల్ జడ్జి అనిత సూచించారు. ఇటుక బట్టీల్లో చిన్నారులతో పని చేయిస్తే జైలుకే వెళ్తారని హెచ్చరించారు. బట్టీలల్లో పని చేస్తున్న చిన్నారులను ప్రభు త్వ పాఠశాలల్లో చేర్పించారు. ఈ సందర్భంగా శనివారం నర్సాపూర్ కోర్టులో చిన్నారులతో కలిసి ఇటుకబట్టీల యజ మానులు న్యాయమూర్తిని కలిశారు.
ఈ సందర్భంగా జడ్డి అనిత మాట్లాడుతూ.. నర్సాపూర్, శివంపేట్, మెదక్ మండలాల్లోని పలు గ్రామాల్లో నిబంధనలకు విరుద్ధ్దంగా ఇటుక బట్టీలు కొనసాగుతున్నాయని తెలిపారు. బట్టీల్లో పిల్లలతో పనులు చేయిస్తున్న యజమానులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. బట్టీల్లో పనిచేస్తున్న దాదా పు 100 మంది పిల్లలను స్కూళ్లలో చేర్పించినట్లు న్యాయ మూర్తికి యజమానులు వివరించారు. కార్యక్రమంలో న్యాయవాదులు ఆర్.శ్రీనివాస్‌రెడ్డి, రాజునాయక్, సత్యనారాయణ, శ్రీనివాస్‌గౌడ్, స్వరూపరాణి, కోర్టు కానిస్టేబుల్స్ అభిషేక్, హరిబాబు, కోర్ట్టు సూపరిండెంటెండ్ శ్రీనివాస్, కోర్టు సిబ్బంది, లీగల్ సర్వీస్ సిబ్బంది పాల్గొన్నారు.