ACB Raid | రూ.70 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి చిక్కిన చేర్యాల తహసీల్దార్
ACB Raid | సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సోమవారం తహసీల్ కార్యాలయంపై దాడులు నిర్వహించి తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ను పట్టుకున్నారు.
చేర్యాల : సిద్దిపేట జిల్లా చేర్యాల తహసీల్దార్ ( Cheryal Tahsildar ) లంచం (Bribe) తీసుకుంటూ ఏసీబీ అధికారులకు చిక్కాడు. సోమవారం తహసీల్ కార్యాలయంపై దాడులు నిర్వహించి తహసీల్దార్ కొర్ర దిలీప్ నాయక్ ( Korra Dileep Naik ) ను పట్టుకున్నారు. నాగాపురి గ్రామం జమున కనకమ్మ, మరికొందరి భూమిలో నాలా కన్వర్షన్ కోసం వచ్చిన వ్యక్తి నుంచి రూ.70 వేలు డిమాండ్ చేయడంతో సదరు వ్యక్తి ఏసీబీ ( ACB ) ని ఆశ్రయించాడు.
దీంతో రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు ముందస్తు ప్రణాళికతో దాడులు చేసి తహసీల్దార్ లంచం తీసుకుంటుండగా రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. కార్యాలయంలో సోదాలు నిర్వహించి పలు రికార్డులు, పత్రాలను పరిశీలించారు. లంచంతో పట్టుబడ్డ తహసీల్దార్‌పై కేసు నమోదు చేసి హైదరాబాద్‌లోని ఏసీబీ కోర్టులో హాజరుపరిచారు. ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా అవినీతి, అక్రమాలకు పాల్పడితే ఏసీబీ టోల్ ఫ్రీ నంబర్ 1064 కు ఫోన్ చేయాలని ఏసీబీ అధికారులు సూచించారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Kiara Advani | రెండో ప్రెగ్నెన్సీ జోష్.. వెకేషన్ ఫొటోలతో మెరిసిపోతున్న కియారా అద్వానీ!
Amitabh Bachchan | అమితాబ్ బచ్చన్ 84వ పుట్టినరోజు వేడుకలు.. ముంబైలోని జల్సా వద్ద కోలాహలం
Donald Trump | రష్యా- అమెరికా డీజిల్ ఒప్పందాన్ని తప్పుబట్టిన జెలెన్స్కీ.. ఉక్రెయిన్‌కు కొత్త అధ్యక్షుడు అవసరమన్న ట్రంప్
Bathukamma | బతుకమ్మ పండుగకు కనీస ఏర్పాట్లు చేయని కాంగ్రెస్ సర్కార్.. వీడియో
Patnam Narendar Reddy | పట్టభద్రులు ఓటర్ల జాబితాలో తమ పేర్లను నమోదు చేయించుకోవాలి : మాజీ ఎమ్మెల్యే పట్నం
ట్రెండింగ్ వార్తలు
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?
Watch: స్కూటీని ఢీకొట్టిన లారీ.. ప్రమాదం నుంచి యువతి ఎలా తప్పించుకున్నదంటే?
Huge Pumpkin | భారీ గుమ్మడికాయ పండించిన బ్రిటన్ రైతు.. దాని బరువు ఎన్ని క్వింటాళ్లో తెలుసా..?

