వచ్చేది బీఆర్ఎస్ ప్రభుత్వమే
మరో రెండేండ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చే ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు ఆ దిశగా పనిచేయాలని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని కోర్పోలులో బీఆర్ఎస్ జెండాను ఆయ న ఆవిషరించారు.
- ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఏమైంది
- మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ ధ్వజం
చౌటకూర్, ఏప్రిల్ 27: మరో రెండేండ్లలో బీఆర్ఎస్ అధికారంలోకి రావడం ఖాయమని, వచ్చే ఎన్నికల వరకు పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కార్యకర్తలు, నాయకులు ఆ దిశగా పనిచేయాలని అందోలు మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ సూచించారు. బీఆర్ఎస్ ఆవిర్భావ దినోత్సవాన్ని పురసరించుకుని సంగారెడ్డి జిల్లా చౌటకూర్ మండలంలోని కోర్పోలులో బీఆర్ఎస్ జెండాను ఆయన ఆవిషరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆరు గ్యారెంటీలు, 420 హామీలతో గద్దెనెకిన కాంగ్రెస్ ఇచ్చిన హామీలు అమలు చేయక చతికిలపడిందని ఎద్దేవా చేశారు.
ఆసరా పింఛన్లను రూ.4వేలకు పెంచి, దివ్యాంగులకు రూ.6వేలు చెల్లిస్తామని, ఆడబిడ్డ పెండ్లికి తులం బంగారం ఇస్తామని వాగ్దానాలు చేసి ప్రజలకు నిలువునా మోసం చేసిందని ఆరోపించారు. ప్రజలను వంచించడంలో కాంగ్రెస్ ముందుంటుందని, అబద్ధాల కాంగ్రె స్ పార్టీకి ఆసార్ అవార్డు ఇవ్వాలన్నారు. ప్రభుత్వ ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం లో సర్కార్ పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. ఇచ్చిన హామీలు అరకొరగా అమలు చేస్తూ సంపూర్ణంగా అమలు చేశామంటూ మంత్రులు, ఎమ్మెల్యేలు గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. రైతులను శాశ్వతంగా రుణ విముక్తులు చేస్తామంటూ ప్రగల్భాలు పలికి అరకొరగా పంట రుణమాఫీ చేసి చేతులు దులుపుకొన్నారని విమర్శించారు.
అందోలు నియోజకవర్గంలోని పులల్, చౌట కూర్, అందోలు మండలాల్లోని 40 వేల ఎకరాలకు సింగూరు జలాలు ఇవ్వకుండా దిగువన ఉన్న ఘనపురం ఆయకట్టుకు నీరు విడుదల చేశారని విమర్శించారు. సింగూరు ప్రాజెక్టు మరమ్మతుల పేరుతో ఇప్పటికే రెండేండ్లుగా క్రాప్ హాలిడే ప్రకటించి రైతులకు తీరని అన్యాయం చేశారని ధ్వజమెత్తారు. ప్రభుత్వం వెంటనే రైతుల వివరాలు సేకరించి ఎకరాకు రూ.30 వేలు పరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చౌటకూర్ మండలంలోని వివిధ గ్రామాల్లో బీఆర్ఎస్ ఆవిర్భావ వేడుకలు నిర్వహించారు. బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు శివకుమార్, సీనియర్ నాయకులు దర్శన్రెడ్డి, తుంగె అనంతయ్య, వీరారెడ్డి, శ్రీహరి, అనిల్, యాదయ్య పాల్గొన్నారు.
Read Today's Latest Medak News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Modi Cabinet | రైల్వే ఉద్యోగులకు మోదీ క్యాబినెట్ శుభవార్త.. 78 రోజుల బోనస్ ప్రకటన
మేగ్యతండాలో మహిళా శక్తి భవనం పరిశీలన
డిండి ఎత్తిపోతల రద్దు చేస్తే పెద్ద ఎత్తున ఉద్యమం : మాజీ ఎమ్మెల్యే కుసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి
Kethireddy Vasudeva reddy | దొర అహంకారంతో వ్యవహరిస్తున్న బల్మూరి వెంకట్ : డాక్టర్ కేతిరెడ్డి వాసుదేవ రెడ్డి
పర్సాయపల్లిలో బతుకమ్మ విగ్రహానికి కొత్త శోభ
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్పై ప్రభావం ఉంటుందా..?

