వట్పల్లి, మే 11 : పెండ్లి చేసుకుంటానంటూ మైనర్ బాలికను మోసం చేసిన కేంద్ర హోంశాఖ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని అందోల్ మాజీ ఎమ్మెల్యే చంటి క్రాంతికిరణ్ డిమాండ్ చేశారు. సోమవారం సంగారెడ్డి జిల్లా వట్పల్లిలో ముఖ్య నాయకులతో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. బాలికను పెండ్లి చేసుకుంటానని నమ్మించి, లైంగికదాడికి పాల్పడిన కుమారుడికి బండి సంజయ్ వత్తాసు పలకడంపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. పిల్లలు తప్పుడు దారులో పోతుంటే సరిచేయాల్సిన బాధ్యత తండ్రిదని, కానీ.. బండి సంజయ్ ఆయన కుమారుడికి వత్తాసు పలకడం చూస్తుంటే తండ్రి అండతోనే కుమారుడు చెలరేగిపోతునట్టు అర్థమవుతుందన్నారు.
బండి సంజయ్‌ను మంత్రివర్గం నుంచి బర్తరఫ్ చేయాలని ఆయన డిమాండ్ చేశారు. చట్టాలను సక్రమంగా అమలు చేస్తున్నామని, మహిళల రక్షణ చట్టాలు సమర్థవంతంగా పనిచేస్తున్నాయని ప్రజలకు నమ్మకం కలగాలంటే అమ్మాయిని మోసం చేసిన బండి సంజయ్ కొడుకుని, కొడుకుకు వత్తాసు పలుకుతున్న బండి సంజయ్ పై కూడా కేసు నమోదు చేయాలని ఆయన ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. సమావేశంలో వరం మాజీ అధ్యక్షుడు వీరారెడ్డి, పార్టీ కార్యదర్శి శివాజీ రావు, నాయకులు బుద్దిరెడ్డి, శ్రీనివాస్ గౌడ్, మధు, ప్రకాష్, మారుతి, శేఖర్, అనిల్, శ్రీకాంత్ తదితరులు పాల్గ్గొన్నారు.
సంగారెడ్డి, మే 11 : కేంద్ర సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి సాయి భగీరథ్‌ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తూ సంగారెడ్డిలో బీఆర్ఎస్వీ, యువత విభాగం కార్యకర్తలు రాస్తారోకో నిర్వహించారు. సోమవారం సంగారెడ్డి కొత్త బస్టాండ్ ఎదుట ప్రధాన రహదారిపై ఫ్లకార్డులతో బైఠాయించి రాస్తారోకో నిర్వహించారు. మంత్రి తన పదవికి బండి సంజయ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. బండి భగీరథ్ వెంటనే వెంటనే అరెస్ట్ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు.
బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడిన బండి సాయి భగీరథ్ విషయంలో రాష్ట్ర ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని డిమాండ్ చేశారు. ఈ కేసు విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన పోలీసు అధికారులపై చర్యలు తీసుకోవాలన్నారు. రాస్తారోకోలో బీఆర్ఎస్వీ నియోజకవర్గ అధ్యక్షుడు పెద్దగొల్ల శ్రీహరి, జిల్లా కోఆర్డినేటర్ రాజేందర్, రాష్ట్ర కార్యదర్శి మన్సూర్ నాయక్, పట్టణ, మండల యువత అధ్యక్షులు వాజిద్, నాని, నరేశ్‌గౌడ్, నాయకులు శ్రావణ్‌రెడ్డి, సదాశివపేట మైనార్టీ అధ్యక్షులు కమిల్, బీఆర్ఎస్వీ నాయకులు పాండునాయక్, రోషన్, అఖిల్, రమేశ్, దిలీప్, గౌతమ్, చింటూ, సంగమేశ్ తదితరులు పాల్గొన్నారు.
మెదక్, మే 11 (నమస్తే తెలంగాణ) : కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్‌ను వెంటనే బర్తరఫ్ చేయాలి. బాలిక పై లైంగికదాడికి యత్నించిన వ్యవహారంలో పోక్సో కేసు నమోదు చేసినా ఎందుకు అరెస్టు చేయడం లేదు. ప్రభుత్వం బాధిత బాలికకు న్యాయం చేయాలి. వెంటనే బండి భగీరథను అరెస్టు చేయాలి. ప్రభుత్వం బండి సంజయ్ కుమారుడిని కాపాడలని చూస్తున్నది. ప్రభుత్వం తక్షణమే మెజిస్ట్రేట్ ఎదుట బాధితురాలి స్టేట్మెంట్ రికార్డు నమోదు చేయాలి.
-పద్మాదేవేందర్‌రెడ్డి,మాజీ డిప్యూటీ స్పీకర్, మెదక్
మెదక్, మే 11 (నమస్తే తెలంగాణ) : రాష్ట్ర ప్రభుత్వం సిట్ ఏర్పాటు చేసి లైంగిక దాడి యత్నం కేసును నీరుగార్చే ప్రయత్నం చేస్తున్నది. కేంద్ర హోం శాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమారుడిని ఇంత వరకు అరెస్టు చేయకపోవడం అనుమానాలకు తావిస్తున్నది. రాష్ట్రంలో బాలిక పై దాడులు జరుగుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ప్రభుత్వం వెంటనే బండి భగీరథను అరెస్టు చేయాలి. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు బాగాలేదు.
-శేరి సుభాష్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ