ఎర్రబెల్లిని అడ్డుకున్న పోలీసులు
హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును జనగామలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు హుటాహుటిన అ క్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.
- జనగామలో రహదారిపైనే బైఠాయింపు.. అరెస్ట్ చేసి పోలీస్ స్టేషన్‌కు తరలింపు
- బీఆర్ఎస్ శ్రేణుల ఆందోళ.. ఎట్టకేలకు విడుదల చేసి హైదరాబాద్‌కు తరలింపు
- ఇది ప్రజాస్వామ్యమేనా : మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు
జనగామ, ఆగస్టు 19 (నమస్తే తెలంగాణ) : హైదరాబాద్ నుంచి నర్సంపేటకు వెళ్తున్న మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావును జనగామలో పోలీసులు అడ్డుకుని అరెస్ట్ చేశారు. దీంతో ఆయన అక్కడే రోడ్డుపై బైఠాయించారు. పోలీసులు బలవంతంగా పోలీస్ స్టేషన్‌కు తరలించారు. విషయం తెలిసిన పాలకుర్తి నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులు హుటాహుటిన అ క్కడికి చేరుకొని ఆందోళన నిర్వహించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రోడ్డుపై వాహనాలు నిలిచిపోయాయి. చివరికి హైదరాబాద్‌కు పోతానంటే విడుదల చేస్తానని పోలీసులు అనడంతో సరేనన్న ఎర్రబెల్లిని పోలీస్ స్టేషన్ నుంచి విడుదల చేశారు.
బంద్ చేసుకునే హక్కు లేదా : ఎర్రబెల్లి
తెలంగాణలో అరాచక పాలన నడుస్తోందని, ప్రజాస్వామ్యంలో బంద్ చేసుకునే హక్కు ప్రతిపక్షాలకు లేదా, ఎలా అడుగడుగునా అరెస్టులు చేస్తారని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు ప్రశ్నించారు. మచ్చలేని నాయకుడు పెద్ది సుదర్శన్‌రెడ్డి విగ్రహాన్ని ఓ దాత ఇచ్చిన ప్రైవేట్ స్థలంలో పెడితే కూలగొడతారా, కొందరు అధికారులు తప్పు చేస్తుండ్రని, వాళ్లను వదలమన్నారు. రాబోయేది బీఆర్ఎస్ పాలనేనని, కేసీఆరే ముఖ్యమంత్రి అని పేర్కొన్నారు. నర్సంపేట బంద్‌ను విఫలం చేయడానికి అనేక మంది నాయకులను హౌస్ అరెస్ట్ చేశారని అన్నారు. అనేక దిగ్బంధాల మధ్య , పార్టీ శ్రేణులు, రాజకీయాలకతీతంగా ప్రజలు పెద్ద ఎత్తున బంద్‌లో పాల్గొని సంపూర్ణ విజయవంతం చేశారన్నారు. వారందరికీ కృతజ్ఞతలు చెబుతున్నానని ఎర్రబెల్లి అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి మూటలు మోయడంలోనే నిమగ్నమయ్యాడని, వ్యవసాయానికి నీళ్లు ఇవ్వలేని దౌర్భాగ్య స్థితిలో ప్రభుత్వం ఉందని ఎర్రబెల్లి విమర్శించారు. రేవంత్‌రెడ్డి తమ్ముళ్లు, రెవెన్యూ శాఖ మంత్రి శ్రీనివాసరెడ్డి భూకబ్జాలు పెరిగాయని, హైదరాబాద్‌లో ఎప్పుడు తమ ఇల్లు ఎప్పుడు కూలగొతారోనని యజమానులు ,భయంతో చస్తున్నారని పేర్కొన్నారు. దీనికి తోడు కొందరు రెవెన్యూ, పోలీసు ఉన్నతాధికారులు కాంగ్రెస్ నాయకులకు వత్తాసు పలుకుతున్నారని, వారందరి భరతం పట్టడం ఖాయమని అన్నారు.
Read Today's Latest Warangal-rural News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Ramayana | రాష్ట్రపతి భవన్లో ‘రామాయణ’ స్పెషల్ స్క్రీనింగ్!
బూర్గంపహాడ్‌లో ఇసుక అక్రమ రవాణాపై టాస్క్‌ఫోర్స్ దాడులు
Kuravi | అమ్మమ్మ ఇంటికొచ్చి అనంతలోకాలకు.. నీటి గుంతలో పడి తొమ్మిదేళ్ల బాలుడి మృతి
Pneumonic Plague | న్యుమోనిక్ ప్లేగు అంటే ఏమిటి.. ప్లేగులో ఎన్ని రకాలు ఉన్నాయి..?
Punjab | డ్రగ్స్ వ్యతిరేక కార్యకర్త హత్య కేసు.. నిందితుడి ఇల్లు కూల్చివేత.. షాపు దహనం
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?

