మెదక్, డిసెంబర్ 21 (నమస్తే తెలంగాణ), వెల్దుర్తి, డిసెంబర్ 21 : ప్రజా సంక్షేమమే ప్రభుత్వ ధ్యేయమని మహిళా కమి షన్ చైర్పర్సన్ సునీతాలక్ష్మారెడ్డి పేర్కొన్నారు. మండల కేంద్రం వెల్దుర్తి పట్టణానికి చెందిన మాజీ ఎంపీటీసీ, బీఆర్ఎస్ పార్టీ నాయకుడు జెగ్గ అశోక్‌గౌడ్ వైద్యచికిత్సకు రూ. 3 లక్షల సీఎంఆర్ఎఫ్ ఎల్వోసీని బుధవారం మహిళా కమిషన్ చైర్పర్సన్ అందజేశారు. కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్న అశోక్‌గౌడ్ హైదరాబాద్‌లోని నిమ్స్‌లో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు సునీతాలక్ష్మారెడ్డి దవాఖానకు వెళ్లి అశోక్‌గౌడ్‌ను పరామర్శించి, చికిత్సకు ఆవసరమైన రూ. 3లక్షల ఎల్వోసీ పత్రాన్ని ఆశోక్‌గౌడ్ సోదరుడు శ్రీనివాస్‌కు అందజేశారు. సీఎంఆర్ఎఫ్ పథకం నిరుపేదలకు అండగా నిలుస్తూ ఆర్థిక భరోసా కల్పిస్తుందని సునీతారెడ్డి అన్నారు.
మెదక్ నియోజకవర్గంలోని వివిధ గ్రామాలకు చెందిన 14 మంది లబ్ధిదారులకు మంజూరైన రూ. 5,20,000 విలువైన సీఎంఆర్ఎఫ్ చెకులను ఇఫో డైరెక్టర్ ఎం.దేవేందర్‌రెడ్డి అందజేశారు. మెదక్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో లబ్ధిదారులకు చెక్కులు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజారోగ్యానికి ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నద న్నారు. పేద ప్రజలు వైద్య చికిత్సకు సీఎంఆర్ఎఫ్ను వినియోగించుకోవాలని సూచించారు. ఆర్థికసాయం అందించి ఆదుకున్న సీఎం కేసిఆర్, ఎమ్మెల్యే పద్మ దేవేందర్‌రెడ్డికి లబ్ధిదారు లు కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ పార్టీ పట్టణాధ్యక్షుడు గంగాధర్, మున్సిపల్ కో ఆప్షన్ సభ్యులు సయ్యద్ ఉమర్, మొహిద్దీన్, నాయకులు లింగారెడ్డి, కృష్ణ, సాంబశివరావు, అశోక్, జుబేర్, నవీన్ పాల్గొన్నారు.
తూప్రాన్, డిసెంబర్ 21 : పేదింటి ఆడబిడ్డల తల్లిదండ్రులకు కల్యాణ లక్ష్మి వరమని సర్పంచ్ లంబ వెంకటమ్మ పేర్కొ న్నారు. మండలంలోని వెంకటాయపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి మీనా, నక్కలపల్లి స్వరూప, బొడ్డు భాగ్యమ్మ, కమ్మ రి ప్రభావతి, కొంతం లక్ష్మికి బుధవారం కల్యాణ లక్ష్మి చెక్కులను అందజేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ ఎక్కడా లేని సంక్షేమ పథకాలు ఒక్క తెలంగాణలోనే అమలవుతున్నాయని, బీఆర్ఎస్తోనే దేశ అభివృద్ధి సాధ్యమన్నారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ హరీశ్, బీఆర్ఎస్ నాయకులు రమేశ్, కొంసాని శ్రీనివాస్‌రెడ్డి, ల్యాగయ్య పాల్గొన్నారు.