మెదక్, ఫిబ్రవరి 26: త్వరితగతిన నేరాల పరిశోధన పూర్తి చేసి పెండింగ్ నేరాల శాతం తగ్గించాలని ఇన్చార్జి డీజీపీ అంజనీకుమార్ మెదక్ జిల్లా అధికారులను ఆదేశించారు. శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో ఆయన మాట్లాడారు. సీసీటీఎన్ఎస్లో పోలీస్స్టేషన్లో ఎఫ్ఐఆర్లు, కేసుల పరిశోధన వివరాలు ఎప్పటికప్పుడు పొందుపర్చాలన్నారు. చిన్న నేరం కూడా జరుగకుండా సంబంధిత పోలీస్స్టేషన్ పరిధిలో నిఘా వ్యవస్థ పటిష్టపర్చాలన్నారు. అన్ని పోలీస్స్టేషన్లలో పెట్రోలింగ్ ముమ్మరం చేయడం, బీట్లు ఏర్పాటు చేయడం, రాత్రి సమయాల్లో వాహనాల తనిఖీలు చేసి దొంగతనాల నివారణకు కృషి చేయాలని సూచించారు. రోడ్డు ప్రమాదా లు జరుగకుండా ఆటోలు, జీపుల్లో సామర్థ్యానికి మించి ప్యాసింజర్లు ఎక్కకుండా చర్యలు తీసుకోవాలన్నారు. కోర్టుల్లోని కేసులు త్వరితగిన పరిష్కారమయ్యేలా కృషి చేయాలన్నారు. పెండింగ్లో ఉన్న ఎన్బీడబ్ల్యూ కేసులపై ప్రత్యేకంగా టీమ్స్ ఏర్పాటు చేసి త్వరితగతిన ఎగ్జిక్యూట్ చేయాలని సూచించారు. మట్కా, గ్యాంబ్లింగ్, గంజాయి మొదలైన చట్టవ్యరేతిక కార్యకలాపాలపై ప్రత్యేకమైన నిఘా ఏర్పాటు చేయాలన్నారు. మోటార్ వాహనాల యాక్ట్ ప్రకారంగా ఇప్పటి వరకు తీసుకున్న చర్యలు, భవిష్యత్లో తీసుకోవాల్సిన చర్యల గురించి తెలిపారు. పెండింగ్ చలానాలు కట్టే విధంగా చర్యలు తీసుకోవాలని, డయల్ 100 ఫిర్యాదుల పట్ల త్వరితగతిన స్పందించాలని తెలిపా రు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ శ్రీబాలస్వామి, మెదక్ డీఎస్పీ సైదు లు, తూప్రాన్ డీఎస్పీ కిరణ్కుమార్, సీఐలు, సిబ్బంది పాల్గొన్నారు.