తూప్రాన్, ఏప్రిల్ 18: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించ తలపెట్టిన బీఆర్ఎస్ రజతోత్సవ సభకు లక్షలాదిగా తరలుదామని ఎఫ్డీసీ మాజీ చెర్మన్, బీఆర్ ఎస్ గజ్వేల్ నియోజకవర్గ ఇన్చార్జి వంటేరు ప్రతాప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం వెంకటాయపల్లి శివారులోని దేవత గార్డెన్స్‌లో, మధ్యా హ్నం తూప్రాన్‌లోని ఎస్వీఆర్ గార్డెన్స్‌లో నిర్వహించిన బీఆర్ఎస్ సన్నాహక సమావేశానికి ఎమ్మెల్సీ యాదవరెడ్డితో కలిసి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ పదేండ్ల కేసీఆర్ పాలన స్వర్ణయుగమన్నారు. అబద్ధపు పునాదుల మీద కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన 15 నెలల్లో హామీలను తుంగలో తొక్కి, ఆరు గ్యారెంటీలను విస్మరించిందన్నారు.
ఈనెల 27న వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో నిర్వహించ తలపెట్టిన రజతోత్సవ వేడుకలు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుండెల్లో రైళ్లు పరుగెత్తే విధంగా నిర్వహించబోతున్నామన్నారు. ఊరూవాడల నుంచి ఉప్పెనలా గులాబీ దండు కదిలి విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్ఎస్ తూప్రాన్ మండలాధ్యక్షుడు బాబుల్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి ఏర్పుల లక్ష్మణ్, మాజీ మున్సిపల్ చెర్మన్ రాఘవేందర్ గౌడ్, మాజీ జెడ్పీటీసీ రాణీసత్యనారాయణ గౌడ్, నాయకులు మన్నె శ్రీనివాస్, చంద్రారెడ్డి, ప్రభాకర్‌రెడ్డి, బజారు చక్రవర్తి, మాచిరెడ్డి కృష్ణారెడ్డి, బొడ్డు రమ్య, మామిడి వెంకటేశ్, దుర్గారెడ్డి, సత్యలింగం, సత్తార్, బురాన్, షబ్బీర్, పసుల నారాయణ, రమేశ్, సామల అశోక్, సిందె చంద్రం, గంగాధర్ వెంకటేశ్, మల్లికార్జున్‌గౌడ్, చింతల దశరథ, నాగరాజు, ఆయా గ్రామాల మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు, మాజీ కౌన్సిలర్లు, గ్రామ కమిటీ అధ్యక్షులు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.
దుబ్బాక, ఏప్రిల్ 18: యావత్ తెలంగాణ ప్రజలంతా మళ్లీ కేసీఆర్ కావాలంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి అన్నారు. బీఆర్ఎస్ రజతోత్సవ సభ సందర్భంగా శుక్రవారం దుబ్బాకలోని రజినీకాంత్‌రెడ్డి ఫంక్షన్హాల్లో దుబ్బాక మున్సిపల్, మండలం, మిరుదొడ్డి, అక్బర్పేట-భూంపల్లి మండలాలకు చెందిన ముఖ్య నాయకులతో సన్నాహక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… తెలంగాణ రాష్ట్ర సాధన కోసం కేసీఆర్ ఏర్పాటు చేసిన ఉద్యమ పార్టీ బీఆర్ఎస్ అని, రాష్ట్రం సాధించుకోవడంతో పాటు అభివృద్ధిలో తెలంగాణను దేశానికే మోడల్‌గా నిలిపిన ఘనత కేసీఆర్‌కే దక్కిందన్నారు. తెలంగాణ ప్రజల బలం, విశ్వాసం గల పార్టీగా బీఆర్ఎస్ ఉండటం గర్వకారణమన్నారు.
పార్టీ ఏర్పడి 25 ఏండ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈనెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న రజతోత్సవ వేడుకలకు నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో పార్టీ శ్రేణులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. 15 నెలల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, కాంగ్రెస్ మోసాలు, ఆరాచకాలకు ప్రజలే స్వస్తి పలికే సమయం వచ్చిందన్నారు. కేసీఆర్ నిర్మించిన ప్రాజెక్టుల నుంచి కనీసం సాగునీళ్లు సరఫరా చేయలేకపోయిందన్నా రు. సాగునీటి సమస్యలతో పంటలు ఎండిపోయి, రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారని ఆరోపించారు. కార్యక్రమంలో మనోహర్‌రావు, సతీశ్‌రెడ్డి, వెంకటనర్సింహారెడ్డి, రొట్టె రాజమౌళి, ఎల్లారెడ్డి, కైలాశ్, రవీందర్ రెడ్డి, కిషన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, వంశీ, శ్రీనివాస్, వనితాభూంరెడ్డి పాల్గొన్నారు.
చేగుంట, ఏప్రిల్ 18: వరంగల్ జిల్లాలోని ఎల్కతుర్తిలో ఈనెల 27న నిర్వహించే రజతోత్సవ బహిరంగ సభకు భారీగా తరలివచ్చి విజయవంతం చేయాలని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్‌రెడ్డి పేర్కొన్నారు. నార్సింగి మండల కేంద్రంలోని ఎల్లమ్మ ఆలయ ఆవరణలో శుక్రవారం బీఆర్ఎస్ ముఖ్య కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఈనెల 27న వరంగల్ జిల్లాలో నిర్వహించనున్న బీఆర్ఎస్ రజతోత్సవ సభకు బీఆర్ఎస్ శ్రేణులు, అభిమానులు తరలిరావాలని సూచించారు.
రామాయంపేట, ఏప్రిల్ 18: వరంగల్ జిల్లా ఎల్కతుర్తిలో ఈనెల 27న జరగనున్న రజతోత్సవ సభ ను విజయవంతం చేద్దామని బీఆర్ఎస్ మెదక్ జిల్లా అధ్యక్షురాలు పద్మాదేవేందర్‌రెడ్డి పిలుపుని చ్చారు. శుక్రవారం రామాయంపేటలో ఆమె ‘చలో ఎల్కతుర్తి’ పోస్టర్‌ను ఆవిష్కరించి మాట్లాడారు. ఈసారి కచ్చితంగా అధికారంలోకి వస్తామని, రేవంత్ సర్కార్ వల్ల ప్రజలకు ఒరిగిందేమీ లేదన్నారు.
ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజాపాలన కాకుండా.. రాక్షస పాలన కొనసాగుతుందన్నారు. రైతులను, ప్రజలను మభ్యపెట్టి గద్దెనెక్కిన రేవంత్ సర్కారుకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. కార్యక్రమంలో మాజీ మున్సిపల్ చైర్మన్ పల్లె జితేందర్‌గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ బాజ చంద్రం, ఉమామహేశ్వర్, నరేందర్‌రెడ్డి ఉన్నారు.