Vanteru Prathap Reddy | కొండపాక(కుకునూరుపల్లి), మార్చి 21 : తపాస్‌పల్లి రిజర్వాయర్ నుంచి డీ4 కెనాల్ ద్వారా కొండపాక మండలంలోని రైతాంగానికి సాగునీరు అందించాలని శుక్రవారం గజ్వేల్ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ ఇన్చార్జి వంంటేరు ప్రతాప్‌రెడ్డి, బీఆర్ఎస్ శ్రేణులు, రైతులతో కలిసి సిద్దిపేట కలెక్టర్ కార్చాలయంలో డీఆర్వోకు వినతి పత్రం ఇచ్చారు.
ఈ సందర్భంగా ప్రతాప్‌రెడ్డి మాట్లాడుతూ.. కొండపాక మండలంలో డీ4 కెనాల్‌కు సాగునీళ్లు వదలకపోవడంతో కొండపాక మండలంలో డీ4 కెనాల్ ఆయకట్టు సుమారు 10వేల ఎకరాల పంట ఎండిపోతుందని ఆవేదన వ్యక్తం చేశాడు. రైతుల పంటపొలాలు ఎండిపోతున్నా, రైతులు కరెంట్ సరిగ్గా లేక అరిగోసలు పడుతున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి చీమకుట్టినట్లు కూడా లేదని విమర్శించాడు. అధికారులకు ఎన్నిమార్లు మొరపెట్టుకున్న, వినతి పత్రాలు సమర్పించిన చుక్క నీరు వదలక పోవడం దురదుష్టకరమన్నారు. మెయింటెన్స్ కోసం రూ.6 కోట్లు అవసరమని అందుకు మెయింటెన్స్ చేసేవారికి డబ్బులు ఇవ్వకపోవడం వాళ్ల పంపులు స్టార్ట్ చేయలేకపోతున్నామని అధికారులు చెప్పడంతో వాపోయినట్లు తెలిపాడు. ఇది పూర్తిగా కాంగ్రెస్ ప్రభుత్వం వైపల్యమని విమర్శించాడు.
మల్లన్నసాగర్ నుంచి తపాస్‌పల్లి రిజర్వాయర్‌కు కాలువ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేసి పరిసర గ్రామాల ప్రజలకు సాగునీరు అందించాలని డిమాండ్ చేశాడు. రాష్ట్రంలో ఎన్ని ప్రాజెక్టులు ఉన్నాయి. ఏ ప్రాజెక్టులకు ఎంత ఆయకట్టు ఉందో అధికారుల నుంచి సమగ్రమైన రిపోర్టు తెప్పించుకొని జనవరిలోనే ప్రాజెక్టులు నింపుకుంటే ఈ సమస్య ఉండేది కాదన్నాడు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మాటల గారడితో అబద్దపు పునాదాల మీద రాజ్యమేలుతుందన్నారని మండిపడ్డాడు. రేవంత్‌రెడ్డి పాలతో రాష్ట్రం దివాల తీసిందన్నారు. పాలన చతకాకపోతే రేవంత్‌రెడ్డి తప్పుకోవాలని రాష్ట్రానికి పునరుత్తేజం తీసువచ్చేందుకు కేసీఆర్ సిద్దంగా ఉన్నారని, మళ్లి రాష్ట్రంలో 50లక్షల ఎకరాల మాగానిగా తెలంగాణ రాష్ట్రాన్ని తయారుచేయడం ఖాయమన్నారు.
కార్యక్రమంలో మాజీ జడ్పీటీసీ అనంతులు అశ్వినిప్రశాంత్, మాజీ ఎంపీపీ ర్యాగల సుగణదుర్గయ్య, గజ్వేల్ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ మాదాసు శ్రీనివాస్, బీఆర్ఎస్ పార్టీ మండలాధ్యక్షుడు నూనె కుమార్‌యాదవ్, మాజీ ఎంపీపీ రాధాకృష్ణారెడ్డి, నాయకులు జైపాల్‌రెడ్డి, పలు గ్రామాల మాజీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు.