పుల్కల్, జూన్ 26 : సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలంలోని సింగూర్ ప్రాజెక్టు దిగువన బ్రిడ్జి నిర్మించక ముందు, ప్రాజెక్టు పైనుంచే వాహనాలు, ప్రజలు రాకపోకలు సాగించేవారు. ఆ తర్వాత ప్రాజెక్టు దిగువ భాగంలో వంతెన నిర్మించడంతో పుల్కల్, సదాశివపేట, మునిపల్లి, జహీరాబాద్ ప్రాంతాలకు రాకపోకలు సులభతరంగా మారాయి.
ప్రస్తుతం ఈ బ్రిడ్జి పైన పలుచోట్ల ఇనుప చువ్వలు తేలాయి. బ్రిడ్జికి నిర్మించిన వాలు విరిగిపోయి ప్రమాదకరంగా మారింది. ప్రాజెక్టు సందర్శకులు ఆదమరిస్తే మంజీరా నదిలో పడే ప్రమాదం ఉంది. అధికారులు స్పందించి మరమ్మతులు చేయాలని ప్రజలు,పర్యాటకులు కోరుతున్నారు.