సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 23: కాంగ్రెస్ ప్రభు త్వం మ్యానిఫెస్టోలో చెప్పినట్లుగానే రైతులందరికీ పంట రుణమాఫీ వర్తింపచేయాలని డిమాండ్ చేస్తూ భారతీయ కిసాన్‌సంఘ్ ఆధ్వర్యంలో సోమవారం సంగారెడ్డి కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆ సంఘం నాయకులు మాట్లాడుతూ పంటరుణమాఫీ కాని రైతుల ఖాతా ల్లో నిబంధనలు లేకుండా రూ.రెండు లక్షలు జమచేయాలని డిమాండ్ చేశారు.
కుటుంబ ధ్రువీకరణ పూర్తైనా పంట రుణమాఫీ డబ్బులు వేయకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారన్నారు. వ్యవసాయశాఖ మంత్రి సూచనల మేరకు నగలు తాకట్టు పెట్టి మరీ కొందరు రైతులు రూ.2 లక్షలపై ఉన్న డబ్బులు కట్టారని, వారందరికీ పం ట రుణమాఫీ అమలుచేయాలన్నారు. రైతులకు విద్య, వైద్యం, వ్యవసాయ పెట్టుబడులు భారీగా పెరిగాయని, వీటికి సమానంగా పంట ఉత్పత్తులు పెరగకపోవడం, వర్షాలకు పంట నష్టాన్ని దృష్టిలో పెట్టుకొని కటాఫ్ డేట్ లేకుండా రైతులందరికీ పం ట రుణమాఫీ చేయాలని డిమాండ్ చేశారు.
వానకాలానికి సంబంధించిన రైతు భరోసాను రైతు సాగు చేస్తున్న భూమి మొత్తానికి ఇవ్వాల్సిందేనన్నారు. త్రిబుల్ఆర్లో భూములు కోల్పోతున్న రైతులకు భూమికి భూమి ఇవ్వాలని లేదా సగం భూమి సగం డబ్బులు ఇచ్చి న్యాయం చేయాలన్నారు. ధర్నాలో భారతీయ కిసాన్ సంఘ్ నాయకులు రాజశేఖర్‌రెడ్డి, నర్సింహారెడ్డి, జోగ య్య, రామకృష్ణారెడ్డి, విష్ణువర్ధన్‌రెడ్డి, లక్ష్మయ్య, రాము లు, కృష్టారెడ్డి తదితరులు పాల్గొన్నారు.