దుబ్బాక,ఆగస్టు 30: గత ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు నెరవేర్చకుండా అభివృద్ధి చేయలేని ఓ అసమర్థత ఎమ్మెల్యేగా రఘునందన్‌రావు చరిత్రలో నిలిచిపోతారని దుబ్బాక మున్సిపల్ చైర్పర్సన్ గన్నె వనితాభూంరెడ్డి, దుబ్బాక జడ్పీటీసీ కడతల రవీందర్‌రెడ్డి మండిపడ్డారు. మంగళవారం దుబ్బాకలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు పదవి తప్పా నియోజకవర్గ ప్రజల సంక్షేమం పట్టింపులేకుండాపోయిందని ఆగ్రహం వ్యక్తం చేశారు.
టీఆర్ఎస్ ప్రభు త్వం అందిస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధిని చూసి ఓర్వలేకనే ఎమ్మెల్యే రాష్ట్ర ప్రభుత్వంపై , మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిపై బురద జల్లే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. దుబ్బాక నియోజకవర్గంలో 57 వేల మందికి ఆసరా పింఛన్లు ఇస్తుంటే ఎమ్మెల్యేగా సంతోషించాల్సింది పోయి, పిం ఛన్లు మంజూరు చేసిన మంత్రి హరీశ్‌రావు, ఎంపీ ప్రభాకర్‌రెడ్డిని విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. ఎమ్మెల్యే రఘునందన్‌రావుకు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని, మంత్రి, ఎంపీలను విమర్శించే నైతిక హక్కు లేదన్నారు.
ఉప ఎన్నికలో ఇచ్చిన హామీలు ఎక్కడికి పోయాయని నిలదీశారు. ప్రజా సం క్షేమం, అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తున్న మంత్రి, ఎంపీలపై విమర్శలు చేస్తే సహించమని హెచ్చరించారు. దుబ్బాక పట్టణంలో ఇటీవల పలు అభివృద్ధి పనులకు మున్సిపల్ చైర్‌పర్సన్‌గా (ఓ మహిళగా) రూ.20 కోట్లు మంజూరు చేయించారని, ఎమ్మెల్యేగా నియోజకవర్గం అభివృద్ధికి ఎన్ని నిధులు తెచ్చారని ప్రశ్నించారు. టీఆర్ఎస్ నాయకులు కొత్త కిషన్‌రెడ్డి, భూంరెడ్డి , శ్రీనివాస్ , ఎండీ.ఖలీల్, దేవరాజ్ పాల్గొన్నారు.